Jahangir Pushpa Khan | బెంగాల్ ‘పుష్పరాజ్’ అరెస్ట్.. భారత్-నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి
Jahangir Pushpa Khan | పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'నేను పుష్ప.. తగ్గేదేలే' అంటూ నిన్నటిదాకా డైలాగులు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించిన తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫాల్టా (Falta) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జహంగీర్ ఖాన్ (Jahangir Khan) అరెస్టయ్యారు.
Jahangir Pushpa Khan | పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'నేను పుష్ప.. తగ్గేదేలే' అంటూ నిన్నటిదాకా డైలాగులు చెప్పి అందరి దృష్టిని ఆకర్షించిన తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫాల్టా (Falta) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జహంగీర్ ఖాన్ (Jahangir Khan) అరెస్టయ్యారు. భారత్-నేపాల్ సరిహద్దు (India-Nepal Border)ల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈవీఎం (EVM) ట్యాంపరింగ్ ఆరోపణలపై ఖాన్‌ను అరెస్ట్ చేశారు.
కాగా, మే 4వ తేదీన వెలువడిన ఫలితాల్లో బెంగాల్‌లో బీజేపీ ఏకంగా 207 స్థానాలు గెలుచుకుని, సువేందు అధికారి ఆధ్వర్యంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఫాల్టాలో ఈవీఎంల ట్యాంపరింగ్ (EVM tampering), సౌత్ 24 పరగణాస్ నియోజకవర్గంలోని ఈవీఎంలపై బీజేపీ అభ్యర్థుల పేర్లు కనపడకుండా బటన్లపై వైట్ టేప్ వేయడంతో పాటు ఓటర్లను బెదిరించినట్లు ఖాన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు నిజమని తేలడంతో ఈసీ ఆయా నియోజకవర్గాల్లో రీపోలింగ్ నిర్వహించింది.
ఈ క్రమంలో యూపీ కేడర్‌కు చెందిన 'ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్' ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ (సింగం ఇమేజ్ ఉన్న ఆఫీసర్) అక్కడ స్పెషల్ అబ్జర్వర్‌గా నియమితులయ్యారు. ఫాల్టా ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారికి శర్మ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి కౌంటర్‌గా జహంగీర్ ఖాన్... టాలీవుడ్ హిట్ సినిమా 'పుష్ప' డైలాగులను వాడుతూ.. ఆయన సింగం అయితే, నేను ఇక్కడి పుష్పరాజ్‌ను. తగ్గేదేలేదంటూ సవాల్ విసిరారు. మే 21 జరిగిన రీపోలింగ్‌లో ఆయన ఎన్నికల బరిలో నిలిచారు.
అయితే, పోలింగ్‌కు రెండు రోజుల ముందు అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక ఓటర్లను బెదిరించడం, ఈవీఎంల ట్యాంపరింగ్‌ల ఆరోపణల నేపథ్యంలో ఖాన్‌పై ఐదు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. అయితే, ఆయా కేసుల్లో కలకత్తా హైకోర్టు ఖాన్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో అరెస్ట్ చేయలేదు. పుష్ప అరెస్టుపై గతంలో మంజూరు చేసిన ఉత్తర్వులను కోర్టు ఉపసంహరించుకోవడంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఖాన్‌ను తాజాగా అరెస్ట్ చేశారు.
Also Read..
ప్రజల సమస్యలపై పోరాడేందుకు మరింత ఐక్యతతో ముందుకెళ్దాం.. ఇండీ కూటమి భేటీలో ఖర్గే
టీఎంసీకి మరో షాక్.. రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాజీనామా
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు.. రేవంత్‌పై పినరయి విజయన్ ఫైర్
సంబంధిత వార్తలు

Taslima Nasrin | 19 ఏళ్ల తర్వాత.. కోల్‌కతాలో అడుగుపెట్టిన తస్లీమా
జులై 31, 2026

Ex Bus Driver | షాకింగ్.. మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం
జులై 30, 2026

Green India Challenge | మడ అడవుల్లో మరో 10వేల మొక్కలు.. సుందర్బన్స్కు అండగా గ్రీన్ ఇండియా చాలెంజ్
జులై 27, 2026
తాజావార్తలు
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం



