Mallikarjun Kharge | ప్రజల సమస్యలపై పోరాడేందుకు మరింత ఐక్యతతో ముందుకెళ్దాం.. ఇండీ కూటమి భేటీలో ఖర్గే
Mallikarjun Kharge | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తోందని ఆరోపించారు. అంతేకాదు రాజ్యాంగంపై దాడి నిరంతరాయంగా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Mallikarjun Kharge | దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ప్రతిపక్ష ‘ఇండీ’ కూటమి సమావేశం (INDIA bloc meet) జరిగింది. ఈ భేటీకి 23 పార్టీల నేతలు హాజరయ్యారు. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా ఇండీ కూటమి నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రంపై పోరాటంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా సమస్యలే అజెండాగా ముందుకు సాగాలని విపక్ష నేతలు నిర్ణయించారు.
ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తోందని ఆరోపించారు. అంతేకాదు రాజ్యాంగంపై దాడి నిరంతరాయంగా కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విపక్షాలను భయపెట్టేందుకు దర్యాప్తు సంస్థలను సాధనాలుగా వాడుకుంటోందని ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. అదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల భారాన్ని ప్రజలు భరిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పరీక్షల విధానంలో జరిగిన ఘోరమైన లోపాల కారణంగా లక్షలాది మంది యువత ఆశలు, ఆకాంక్షలు దెబ్బతిన్నాయని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న సమస్యలపై ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు కలిసికట్టుగా చేసిన పోరాటాన్ని ఖర్గే ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లులను ఓడించడంలో కూటమి తన ఐక్యతను చాటిందన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానాల్లోనూ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు మరింత ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఇక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ లక్షలాది మంది ప్రజల ఓటు హక్కును హరిస్తోందని ఖర్గే ఆరోపించారు.
Also Read..
టీఎంసీకి మరో షాక్.. రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాజీనామా
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు.. రేవంత్‌పై పినరయి విజయన్ ఫైర్
కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ గుడ్ న్యూస్.. పార్టిసిపేటింగ్ పాలసీదారులకు భారీ బోనస్..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Wedding Sherwani | ఇస్త్రీ చేస్తుండగా కాలిన షేర్వాణీ.. రూ. 14 వేలు జరిమానా విధించిన కోర్టు
- ●Tiger | నడిరోడ్డుపై పెద్ద పులి.. బైకర్ ఏం చేశాడో తెలుసా..?
- ●Vastu Tips | గులాబీ మొక్క శుభమా..? అశుభమా..? ఏ దిశలో నాటితే మంచిది..?
- ●HMWSSB | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా బంద్
- ●Horoscope | ఆగస్టు 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఊహించిన ఆర్థిక లాభాలు..!
- ●Nizamabad | నిజామాబాద్ జీజీహెచ్‌కు రిఫరల్ హోదా

Wedding Sherwani | ఇస్త్రీ చేస్తుండగా కాలిన షేర్వాణీ.. రూ. 14 వేలు జరిమానా విధించిన కోర్టు

Tiger | నడిరోడ్డుపై పెద్ద పులి.. బైకర్ ఏం చేశాడో తెలుసా..?

Vastu Tips | గులాబీ మొక్క శుభమా..? అశుభమా..? ఏ దిశలో నాటితే మంచిది..?

HMWSSB | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా బంద్






