TISS | కాక్రోచ్‌ల భయం.. సీజేఐ పాల్గొనాల్సిన స్నాతకోత్సవాన్ని చివరి నిమిషంలో వాయిదా వేసిన టిస్
TISS | నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (Tata Institute of Social Sciences) అనూహ్య నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన 86వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమాన్ని అకస్మాత్తుగా వాయిదా వేసింది.
TISS | త్రినేత్ర.న్యూస్ : నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న వేళ ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (Tata Institute of Social Sciences) అనూహ్య నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన 86వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమాన్ని అకస్మాత్తుగా వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత విద్యార్థులకు కళాశాల యాజమాన్యం ఈమెయిల్స్ పంపింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Justice Surya) ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉండగా.. బాంబే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర ఘుగే గౌరవ అతిథిగా పాల్గొనాల్సి ఉంది.
‘ఊహించని పరిస్థితుల’ కారణంగా స్నాతకోత్సవాన్ని వాయిదా వేసినట్లు యాజమాన్యం తెలిపింది. అయితే, అతిథులను లక్ష్యంగా చేసుకొని విద్యార్థులు నిరసలు తెలిపే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో కళాశాల యాజమాన్యం చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు, విద్యార్థి ప్రతినిధులు తెలిపారు. వేడుక సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి సంబంధించిన నిరసనలు చెలరేగే అవకాశం ఉందని కళాశాల యాజమాన్యం భయపడినట్లుగా సమాచారం.
కళాశాల యాజమాన్యం నిర్ణయం పట్టభద్రులైన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర నిరాశను కలిగించింది. ఈ కార్యక్రమం కోసం వీరంతా ఇప్పటికే విమాన, రైలు, హోటల్ బుకింగ్స్ చేసుకున్నారు. కార్యక్రమం చివరి నిమిషంలో రద్దుకావడంతో వారంతా అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఆర్థిక సహాయం కోసం వచ్చే అభ్యర్థనలను పరిశీలిస్తామని టిస్ తెలిపింది. వేడుకకు సంబంధించిన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.
Also Read..
కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్.. దెబ్బతిన్న దుకాణాలు, వాహనాలు
దేశ విమానయాన రంగంలో అసాధారణ పురోగతి.. 12 ఏళ్లలో 166 ఎయిర్‌పోర్టులు : ప్రధాని మోదీ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

National Law School | సీజేఐపై విద్యార్థుల ఆగ్రహ ఫలితం.. స్నాతకోత్సవాన్ని రద్దు చేసిన నేషనల్ లా స్కూల్
ఆగస్టు 27, 2026

Supreme Court | కోర్టు విచారణలపై వార్తా సంస్థలు రిపోర్టింగ్ చేయొచ్చు.. కానీ : సుప్రీంకోర్టు
ఆగస్టు 5, 2026

CJI Justice Surya Kant | మధ్యవర్తిత్వం భారతీయ సంస్కృతిలో భాగమే : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
ఆగస్టు 1, 2026
తాజావార్తలు
- ●Saleem Pasha | రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించే కుట్ర : సలీం పాషా
- ●MK Stalin | స్టాలిన్ సూట్కేట్ భామ వ్యాఖ్యలపై దుమారం.. భగ్గుమన్న నేతలు
- ●Revanth Reddy | ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి
- ●John Wesley | 'సర్' పేరుతో 13 కోట్ల ఓట్ల తొలగింపు
- ●Stock Markets | అక్టోబర్లో మార్కెట్లకు మరో పరీక్ష.. కీలకం ఈ 5 అంశాలే..
- ●Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్ను అరెస్టు చేయాలి

Saleem Pasha | రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించే కుట్ర : సలీం పాషా

MK Stalin | స్టాలిన్ సూట్కేట్ భామ వ్యాఖ్యలపై దుమారం.. భగ్గుమన్న నేతలు

Revanth Reddy | ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి

John Wesley | 'సర్' పేరుతో 13 కోట్ల ఓట్ల తొలగింపు



