త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MK Stalin | స్టాలిన్ సూట్‌కేట్ భామ వ్యాఖ్య‌ల‌పై దుమారం.. భ‌గ్గుమ‌న్న నేత‌లు

MK Stalin | టీవీకే అభ్యర్థి (TVK Candidate) సత్యభామపై (Sathyabhama) తమిళనాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత‌ ఎంకే స్టాలిన్ (MK Stalin) చేసిన బాడీషేమింగ్ కామెంట్స్ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

D

National | Published On Oct 3, 2026, 3.35 pm IST

MK Stalin | స్టాలిన్ సూట్‌కేట్ భామ వ్యాఖ్య‌ల‌పై దుమారం.. భ‌గ్గుమ‌న్న నేత‌లు
Advertisement

MK Stalin | త్రినేత్ర న్యూస్ : టీవీకే అభ్యర్థి (TVK Candidate) సత్యభామపై (Sathyabhama) తమిళనాడు మాజీ ముఖ్య‌మంత్రి, డీఎంకే అధినేత‌ ఎంకే స్టాలిన్ (MK Stalin) చేసిన బాడీషేమింగ్ కామెంట్స్ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే తరఫున ధారాపురం నుంచి గెలిచిన సత్యభామ.. ఆ త‌ర్వాత కొద్ది వారాలకే తన పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది (Dharapuram bypoll). ఇప్పుడు అదే స్థానం నుంచి స‌త్య‌భామ టీవీకే అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా స్టాలిన్ మాట్లాడుతూ.. స‌త్య‌భామ‌ను ఉద్దేశించి వివాదాస్ప‌ద‌ వ్యాఖ్య‌లు చేశారు. ఆమె పార్టీ మార్పు వెనుక డబ్బు ప్రమేయం ఉందని ఆరోపించారు. ఆమె స‌త్య‌భామ కాదు.. సూట్‌కేస్ భామ అంటూ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు ఆమెపై బాడీషేమింగ్ కామెంట్లు చేశారు. స్టాలిన్‌ వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా విమర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టీవీకే నేత‌లు స్టాలిన్ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు.

ముఖ్య‌మంత్రి విజ‌య్ (CM Vijay) సైతం స్టాలిన్ తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డంలో డీఎంకే పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని విమ‌ర్శించారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లే వారికి త‌గిన బుద్ధి చెబుతార‌ని స్ప‌ష్టం చేశారు. ప‌లువురు టీవీకే నేత‌లు సైతం స్టాలిన్ తీరును తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. ద‌ళితురాల‌నే కార‌ణంతోనే స‌త్య‌భామ‌పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారంటూ మండిప‌డుతున్నారు. కాగా, మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేలా అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేస్తే చ‌ట్ట‌ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీఎం ఇప్ప‌టికే హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స్టాలిన్ వ్యాఖ్య‌ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read..

అక్టోబ‌ర్ 10న చ‌లో జంత‌ర్ మంత‌ర్‌.. సీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

షాకింగ్‌.. 43వ అంతస్తు నుంచి దూకిన వ్య‌క్తి.. రెండు ముక్క‌లైన బాడీ

'స‌ర్' పేరుతో 13 కోట్ల ఓట్ల తొల‌గింపు

Advertisement
Advertisement