త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

John Wesley | ‘స‌ర్’ పేరుతో 13 కోట్ల ఓట్ల తొల‌గింపు

John Wesley | కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీరుపై, ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ వ్య‌వ‌హారంపై సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ తీవ్రంగా మండిప‌డ్డారు.

S

Telangana | Published On Oct 3, 2026, 3.28 pm IST

John Wesley | ‘స‌ర్’ పేరుతో 13 కోట్ల ఓట్ల తొల‌గింపు
Advertisement

John Wesley | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీరుపై, ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ వ్య‌వ‌హారంపై సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్ వెస్లీ తీవ్రంగా మండిప‌డ్డారు. గాంధీ భ‌వ‌న్‌లో టీ పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌తో క‌లిసి జాన్ వెస్లీ మీడియాతో మాట్లాడారు.

స‌ర్ పేరుతో దేశ వ్యాప్తంగా 13 కోట్ల ఓట్ల‌ను తొల‌గించారు. ఫామ్ 6 నిబంధ‌న‌ల‌తో ఓట్లు చేర్చ‌కుండా చేస్తున్నారు. దేశంలో జ‌రిగే ప్ర‌తి ఎన్నిక‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తుంది. తొల‌గించిన ఓట్ల‌లో అర్హులైన వారిని తిరిగి చేర్చాలి అని ఆయ‌న డిమాండ్ చేశారు.

స‌ర్‌కు వ్య‌తిరేకంగా ఈ నెల 6న క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల ముందు ఆందోళ‌న‌లు చేప‌డుతామ‌న్నారు. 8న లోక్‌భ‌వ‌న్ ముట్ట‌డి కార్య‌క్ర‌మం చేప‌డుతాం. న‌వంబ‌ర్ 1న చ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. సీఈసీని తొల‌గించ‌డంతో పాటు ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.

ప్ర‌జాస్వామ్యానికి ముప్పుగా స‌ర్‌

స‌ర్ ప్ర‌క్రియ ప్ర‌జాస్వామ్యానికి ముప్పుగా ప‌రిణ‌మించింది అని సీపీఐ నాయ‌కుడు ఈటీ న‌ర‌సింహ పేర్కొన్నారు. ఇండియా కూట‌మి తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు తామంతా స‌మావేశ‌మ‌య్యామ‌ని తెలిపారు. ప్ర‌ధాని మోదీ ఏది చెబితే అది సీఈసీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో దేశంలోని ప్ర‌జాస్వామ్య‌వాదులంతా ఆలోచ‌న చేయాల‌న్నారు. మోదీకి వ్య‌తిరేకంగా కామెంట్స్ పెడితే ఓట‌ర్ లిస్టు నుంచి తొల‌గిస్తున్నారు. త‌ల్లీదండ్రుల వ‌య‌సు స‌రిపోల‌డం లేద‌ని కొంత‌మంది ఓట‌ర్ల‌కు నోటీసులు ఇచ్చారు. త‌మ నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో సామాన్య ప్ర‌జ‌లు భారీ ఎత్తున పాల్గొనాల‌ని న‌ర‌సింహ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement