National Law School | సీజేఐపై విద్యార్థుల ఆగ్రహ ఫలితం.. స్నాతకోత్సవాన్ని రద్దు చేసిన నేషనల్ లా స్కూల్
National Law School | బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (The National Law School of India University) సెప్టెంబర్ 12న జరగాల్సిన తన 34వ వార్షిక స్నాతకోత్సవాన్ని రద్దు చేసింది. కార్యక్రమానికి సీజేఐ హాజరును (CJI Justice Surya Kant) వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో అనివార్య పరిస్థితులను కారణంగా చూపుతూ వర్సిటీ తన నిర్ణయం వెలువరించింది.
National Law School | త్రినేత్ర.న్యూస్ : నిరుద్యోగుల్ని బొద్దింకలతో పోలుస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Justice Surya Kant) చేసిన వ్యాఖ్యల పట్ల లా విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ కళాశాలల్లో నిర్వహించే స్నాతకోత్సవ కార్యక్రమానికి సీజేఐ రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (Tata Institute of Social Sciences), హైదరాబాద్ నల్సార్ వర్సిటీ విద్యార్థులు సీజేఐకు రాకను వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా వర్సిటీలు తమ స్నాతకోత్సవ కార్యక్రమాలను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నాయి. తాజాగా విద్యార్థుల ఆగ్రహ ఫలితంగా మరో వర్సిటీ కూడా అలాంటి నిర్ణయమే తీసుకోవాల్సి వచ్చింది.
బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (The National Law School of India University) సెప్టెంబర్ 12న జరగాల్సిన తన 34వ వార్షిక స్నాతకోత్సవాన్ని రద్దు చేసింది. ఈ ఈ వెంట్‌కు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌తోపాటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ( Bar Council of India Chairman Manan Kumar Mishra ) హాజరుకావాల్సి ఉంది. అయితే, వారి రాకను వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో అనివార్య పరిస్థితులను కారణంగా చూపుతూ వర్సిటీ తన నిర్ణయం వెలువరించింది. కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు విద్యార్థులకు సమాచారం అందించింది. అయితే, వేడుకను రద్దు చేసినా.. విద్యార్థులకు మాత్రం డిగ్రీ పట్టాలను అందిస్తామని స్పష్టం చేసింది. ఇందుకోసం విద్యార్థులు తమ డిగ్రీలను స్వయంగా అందుకోవడానికి స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరు కావలసిన అవసరం లేదని తెలిపింది. తమ పట్టాలను కొరియర్ ద్వారా లేదా యూనివర్సిటీ క్యాంపస్‌లోనే తీసుకోవడానికి అవకాశం కల్పించింది.
Also Read..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

NALSAR students | విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు వాళ్లెవరు..? బీసీఐపై సీజేఐ ఆగ్రహం
ఆగస్టు 14, 2026

Supreme Court | కోర్టు విచారణలపై వార్తా సంస్థలు రిపోర్టింగ్ చేయొచ్చు.. కానీ : సుప్రీంకోర్టు
ఆగస్టు 5, 2026

CJI Justice Surya Kant | మధ్యవర్తిత్వం భారతీయ సంస్కృతిలో భాగమే : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
ఆగస్టు 1, 2026
తాజావార్తలు
- ●Climate Change | హిమాలయాలకు ముప్పు
- ●Swine Flu | స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నా, ఆందోళన అక్కర్లేదు: మాజీ ఐసీఎంఆర్ చీఫ్
- ●Punjab Elections 2027 | పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీ జోడీ?
- ●Vishwak Sen | పాలిటిక్స్‌లోకి విశ్వక్‌సేన్ - లెగసీ రిలీజ్‌పై అప్‌డేట్
- ●Hotel Check-in | హోటల్స్‌లో ఆధార్ అవసరం లేదు.. క్యూఆర్ కోడ్, ఓటీపీ చాలు..
- ●Rashi Singh | హైదరాబాద్‌కే షిఫ్ట్ అయ్యా : రాశి సింగ్

Climate Change | హిమాలయాలకు ముప్పు

Swine Flu | స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నా, ఆందోళన అక్కర్లేదు: మాజీ ఐసీఎంఆర్ చీఫ్

Punjab Elections 2027 | పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీ జోడీ?

Vishwak Sen | పాలిటిక్స్‌లోకి విశ్వక్‌సేన్ - లెగసీ రిలీజ్‌పై అప్‌డేట్



