Cloudburst | కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్.. దెబ్బతిన్న దుకాణాలు, వాహనాలు
Cloudburst | భారీ వర్షాలకు జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లోని కిష్త్వార్ (Kishtwar) జిల్లాలో క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) సంభవించింది. కొండలపైనుంచి భారీగా బురద రోడ్లపైకి కొట్టుకొచ్చింది. ఈ ఆకస్మిక వరదలకు పలు దుకాణాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Cloudburst | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో కురిసిన కుండపోత వర్షానికి కిష్త్వార్ (Kishtwar) జిల్లాలో క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) సంభవించింది. ఛత్రూ (Chatroo) ప్రాంతంలో మేఘ విష్ఫోటనం సంభవించినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ వరదలకు రోడ్లపైకి బురద కొట్టుకొచ్చింది. దుకాణాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి.
అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. భారీ వర్షాలకు కిష్త్వార్, దోడా, రాంబన్ జిల్లాల్లోని నదులు పొంగి పొర్లుతున్నాయి. పలు వాహనాలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. మరోవారం రోజులపాటూ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
VIDEO | J&K: Cloudburst in Kishtwar's Chatroo leads to closure of national highway; no casualties reported.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/4IwcEQcOBo
— Press Trust of India (@PTI_News) August 1, 2026
Also Read..
అజిత్ దోవల్‌కు లోక్‌మాన్య తిలక్ జాతీయ అవార్డు
దేశ విమానయాన రంగంలో అసాధారణ పురోగతి.. 12 ఏళ్లలో 166 ఎయిర్‌పోర్టులు : ప్రధాని మోదీ
తాజావార్తలు
- ●'మక్కా' వేదికగా పాక్-సౌదీ-టర్కీల సంచలన రక్షణ ఒప్పందం: భారత్‌పై పాక్ కయ్యానికి కాలుదువ్వితే ఏం జరుగుతుంది?
- ●Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు
- ●POCSO Judgment | 12 ఏండ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు.. 10 ఏండ్ల జైలు శిక్ష వేశారు
- ●Minister Sridhar Babu | గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ
- ●TGCSB | సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణకు అగ్రస్థానం
- ●Sreeleela | ప్రియుడి కోసం జాన్వీకపూర్‌తో శ్రీలీల ఫైట్ - ఒకే అబ్బాయితో ఇద్దరు ప్రేమలో పడ్డారా?

'మక్కా' వేదికగా పాక్-సౌదీ-టర్కీల సంచలన రక్షణ ఒప్పందం: భారత్‌పై పాక్ కయ్యానికి కాలుదువ్వితే ఏం జరుగుతుంది?

Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు

POCSO Judgment | 12 ఏండ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు.. 10 ఏండ్ల జైలు శిక్ష వేశారు

Minister Sridhar Babu | గ్రామీణ ప్రాంతాలకు హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ






