Supreme Court | కోర్టు విచారణలపై వార్తా సంస్థలు రిపోర్టింగ్ చేయొచ్చు.. కానీ : సుప్రీంకోర్టు
Supreme Court | కోర్టు విచారణలకు సంబంధించిన వీడియోల అప్‌లోడ్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, తాము జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు గుర్తింపు పొందిన వార్తా సంస్థలకు (recognised news outlets) వర్తించవని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Supreme Court | త్రినేత్ర.న్యూస్ : కోర్టు విచారణలకు సంబంధించిన వీడియోల అప్‌లోడ్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే, తాము జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు గుర్తింపు పొందిన వార్తా సంస్థలకు (recognised news outlets) వర్తించవని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు ప్రొసీడింగ్స్ ఆడియో-వీడియో క్లిప్‌లను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.
జర్నలిస్టులు, గుర్తింపు పొందిన మీడియా సంస్థలు కోర్టులో జరిగే పరిణామాలు, తీర్పులపై సాధారణ వార్తలను యథావిధిగా ప్రచురించవచ్చు. కానీ వార్తా కథనాల్లో లేదా సోషల్ మీడియాలో కోర్టు విచారణలకు సంబంధించిన ఒరిజినల్ లేదా ఎడిట్ చేసిన ఆడియో, వీడియో క్లిప్‌లను వాడకూడదు అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
కాగా, కోర్టు విచారణలకు సంబంధించిన వీడియోల అప్‌లోడ్‌పై సర్వోన్నత న్యాయస్థానం గత నెల కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సెక్రటరీ జనరల్, సంబంధిత హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడం, రీ-పోస్ట్ చేయడం, లేదా అప్‌లోడ్ చేయడంపై మధ్యంతర నిషేధం విధించింది. దీనివల్ల న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలగడమే కాకుండా, ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని పేర్కొంది. ఈ ఉత్తర్వులు సాధారణ వార్తా ప్రసారాలకు వర్తించవని ధర్మాసనం అప్పట్లోనే స్పష్టం చేసింది. కానీ కోర్టు ఉత్తర్వులపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చింది. గుర్తింపు పొందిన వార్తా సంస్థలు కోర్టు విచారణలపై వార్తలు ప్రచురించడంపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లుగా ఈ ఉత్తర్వును భావించరాదని పేర్కొంది.
Also Read..
ఆర్‌ఏసీ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. ఏసీ కోచ్‌లలో పూర్తి బెడ్‌రోల్ తప్పనిసరి..
కాళేశ్వరం, సీతారామ సహా ఏడు ప్రాజెక్టులను రద్దు చేయాలా..?
విద్యార్థి నిరసనకారులపై హింసాత్మక చర్యలొద్దు.. సంయమనం పాటించాలి : సుప్రీంకోర్టు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

One Nation One Election JPC | ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ కమిటీ, సుప్రీంకోర్టు జడ్జీల భేటీ?: రాజ్యాంగ విరుద్ధమంటూ కపిల్ సిబల్ ఫైర్
అక్టోబర్ 1, 2026

Mamata Banerjee | మమత వర్గానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
అక్టోబర్ 1, 2026

Supreme Court | బాణసంచాపై సంపూర్ణ నిషేధం కుదరదు : సుప్రీంకోర్టు
సెప్టెంబర్ 30, 2026
తాజావార్తలు
- ●India Leprosy Cases 2026 | 2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు.. బయటపడుతున్న చేదు నిజాలు
- ●Prakash Raj | బీజేపీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నయ్
- ●Telangana Express | ఢిల్లీ బాటలో ఐదు దశాబ్దాలు.. ‘బ్లూ బుల్లెట్’ గోల్డెన్ రన్!
- ●Srinivas Goud | బీసీ కుల గణన చేసి.. రిజర్వేషన్లు కల్పించాలి
- ●Priyanka Kakkar | ఆప్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్
- ●Primebook 3 Max | రూ.35,990కే ప్రైమ్బుక్ 3 మ్యాక్స్.. ఏఐ ఫీచర్లతో కొత్త ల్యాప్‌టాప్..

India Leprosy Cases 2026 | 2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు.. బయటపడుతున్న చేదు నిజాలు

Prakash Raj | బీజేపీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నయ్

Telangana Express | ఢిల్లీ బాటలో ఐదు దశాబ్దాలు.. ‘బ్లూ బుల్లెట్’ గోల్డెన్ రన్!

Srinivas Goud | బీసీ కుల గణన చేసి.. రిజర్వేషన్లు కల్పించాలి



