PM Modi | దేశ విమానయాన రంగంలో అసాధారణ పురోగతి.. 12 ఏళ్లలో 166 ఎయిర్‌పోర్టులు : ప్రధాని మోదీ
PM Modi | దేశ విమానయాన రంగం (Indias aviation sector) అసాధారణ పురోగతిని సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. 2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలే ఉండేవని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్డీయే అదికారంలోకి వచ్చిన 12 ఏళ్లలోనే 166 విమానాశ్రయాలు వచ్చాయన్నారు.
PM Modi | త్రినేత్ర.న్యూస్ : దేశ విమానయాన రంగం (Indias aviation sector) అసాధారణ పురోగతిని సాధించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం (Bhogapuram)లో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (Alluri Sitarama Raju International Airport) ప్రధాని ఇవాళ ప్రారంభించారు. సుమారు రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు.
తెలుగులో అందరికీ నమస్కారం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని... సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు అర్పించారు. ఏపీ అభివృద్ధిలో ఈరోజు కీలకమైన రోజుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ముఖ్యంగా స్వర్ణాంధ్ర విజన్‌లో ఒక కీలకమైన రోజని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఓ రన్‌వేలా ఉపయోగపడుతుందని అన్నారు. ఇది ఆంధ్ర యువత ఉజ్వల భవిష్యత్తుకు ఒక 'లాంచ్‌ప్యాడ్' అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలే ఉండేవని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలోనే దేశ విమానయాన రంగం అసాధారణ పురోగతిని సాధించిందని చెప్పారు. 166 విమానాశ్రయాలు వచ్చాయన్నారు. సామాన్యులకు కూడా విమాన ప్రయాణాన్ని చేరువ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాంతీయ విమాన సర్వీసుల అనుసంధాన పథకం 'ఉడాన్' (UDAN) గురించి ప్రధాని ప్రస్తావించారు. ఈ పథకం వల్ల ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య పెరగడమే కాకుండా.. విమాన ప్రయాణికుల సంఖ్యా పెరిగిందన్నారు. చిన్నచిన్న పట్టణ ప్రజలకు కూడా విమానంలో ప్రయాణించే అవకాశాన్ని కల్పించినట్లు వివరించారు.
గతంలో దేశంలో ఏ ఎయిర్‌పోర్టు నిర్మించినా ఒక్కరి కుటుంబానికి చెందిన పేర్లే పెట్టేవారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆ చరిత్రను ఎన్డీయే ప్రభుత్వం తిరగరాసిందన్నారు. అయోధ్య ఎయిర్‌పోర్టుకు వాల్మీకీ పేరు, పంజాబ్‌లో సంత్ రవిదాస్ పేరుతో ఎయిర్‌పోర్టు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ఎన్డీయే కూటమి భోగాపురం కొత్త ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రధాని ప్రకటించారు.
Also Read..
థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి అఖిల్ అక్కినేని వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

MLA Naveen Yadav | బీసీల లెక్కలు తేలాల్సిందే : ఎమ్మెల్యే నవీన్ యాదవ్
అక్టోబర్ 2, 2026

Captain Smit Machchhar | 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.. పైలట్ స్మిత్‌తో ప్రధాని మోదీ
అక్టోబర్ 2, 2026

Vladimir Putin | ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపుకు మోదీ వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయ్ : పుతిన్
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●India Leprosy Cases 2026 | 2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు.. బయటపడుతున్న చేదు నిజాలు
- ●Prakash Raj | బీజేపీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నయ్
- ●Telangana Express | ఢిల్లీ బాటలో ఐదు దశాబ్దాలు.. ‘బ్లూ బుల్లెట్’ గోల్డెన్ రన్!
- ●Srinivas Goud | బీసీ కుల గణన చేసి.. రిజర్వేషన్లు కల్పించాలి
- ●Priyanka Kakkar | ఆప్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ప్రియాంక కక్కర్
- ●Primebook 3 Max | రూ.35,990కే ప్రైమ్బుక్ 3 మ్యాక్స్.. ఏఐ ఫీచర్లతో కొత్త ల్యాప్‌టాప్..

India Leprosy Cases 2026 | 2027 నాటికి కుష్టు రహిత భారత్ సాధ్యమేనా? చిన్నారుల్లో 3,800కు పైగా కొత్త కేసులు.. బయటపడుతున్న చేదు నిజాలు

Prakash Raj | బీజేపీ అనుకూల ఓట్లు మాత్రమే ఉంటున్నయ్

Telangana Express | ఢిల్లీ బాటలో ఐదు దశాబ్దాలు.. ‘బ్లూ బుల్లెట్’ గోల్డెన్ రన్!

Srinivas Goud | బీసీ కుల గణన చేసి.. రిజర్వేషన్లు కల్పించాలి



