Stock Markets | అక్టోబర్‌లో మార్కెట్లకు మరో పరీక్ష.. కీలకం ఈ 5 అంశాలే..
Stock Markets | సెప్టెంబర్‌లో భారీ అమ్మకాలతో కుదేలైన భారత ఈక్విటీ మార్కెట్లు అక్టోబర్‌లోకి బలహీనంగా అడుగుపెట్టాయి. ఇటీవలి సంవత్సరాల్లో నమోదైన అత్యంత తీవ్ర నెలవారీ పతనాల్లో ఒకటిగా సెప్టెంబర్ నిలిచింది. నిఫ్టీ దాదాపు 6 శాతం పడిపోయింది. అలాగే వరుసగా ఎనిమిదో వారం నష్టాలను నమోదు చేసింది. 25 ఏళ్లలో ఇదే అత్యంత సుదీర్ఘమైన నష్టాల పరంపరగా నిలిచింది.
Stock Markets | సెప్టెంబర్‌లో భారీ అమ్మకాలతో కుదేలైన భారత ఈక్విటీ మార్కెట్లు అక్టోబర్‌లోకి బలహీనంగా అడుగుపెట్టాయి. ఇటీవలి సంవత్సరాల్లో నమోదైన అత్యంత తీవ్ర నెలవారీ పతనాల్లో ఒకటిగా సెప్టెంబర్ నిలిచింది. నిఫ్టీ దాదాపు 6 శాతం పడిపోయింది. అలాగే వరుసగా ఎనిమిదో వారం నష్టాలను నమోదు చేసింది. 25 ఏళ్లలో ఇదే అత్యంత సుదీర్ఘమైన నష్టాల పరంపరగా నిలిచింది. సెప్టెంబర్ మొత్తం సిరీస్‌లో నిఫ్టీ 1,400 పాయింట్లకు పైగా కోల్పోయింది. సెన్సెక్స్ కూడా ఇదే సమయంలో గణనీయంగా పతనమైంది. విదేశీ పెట్టుబడిదారులు భారీగా షేర్లను విక్రయించడం మార్కెట్‌లపై ప్రధానంగా ఒత్తిడిని పెంచింది. సెప్టెంబర్‌లో ఎఫ్‌ఐఐలు రెండు నెలల కొనుగోళ్ల పరంపరకు తెరదించి, భారత ఈక్విటీల్లో భారీగా అమ్మకాలు చేపట్టారు. ఇప్పటికే 2026లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం ప్రతికూలంగా ఉండగా, ఎన్‌ఎస్‌డీఎల్ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారుల నికర అమ్మకాలు రూ.2.5 లక్షల కోట్లను దాటాయి.
సాధారణ కరెక్షన్ కాదు..
బ్లూ ఆస్టర్ క్యాపిటల్, క్రెబాకో గ్లోబల్ వ్యవస్థాపకుడు, సీఈఓ, ఫండ్ మేనేజర్ సిద్ధార్థ్ సోగాని జైన్ అభిప్రాయం ప్రకారం సెప్టెంబర్ మార్కెట్ పతనం పూర్తిస్థాయి కుప్పకూలడం కంటే షేర్ల విలువల పునర్మూల్యాంకనంగా చూడాలన్నారు. సెప్టెంబర్ సాధారణ కరెక్షన్ కాదని, నిఫ్టీ దాదాపు 6 శాతం పడిపోయి ఎనిమిదేళ్లలోనే అత్యంత దారుణమైన సెప్టెంబర్‌ను నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ప్రస్తుతం భారత మార్కెట్లకు అతిపెద్ద సవాలుగా మారాయి. అమెరికా బాండ్ రాబడులు 5 శాతానికి పైగా ఉండడం, డాలర్ బలంగా కొనసాగడం, ముడి చమురు ధరలు అధిక స్థాయిలో ఉండడం, రూపాయి బలహీనపడడం వంటి అంశాలు భారత మార్కెట్లను మరింత సున్నితంగా మారుస్తున్నాయి. అమెరికా బాండ్ రాబడులు పెరిగితే డాలర్ ఆస్తుల్లో పెట్టుబడులకు అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అధిక రాబడి లభించే అవకాశం ఉంటుంది. దీంతో వర్ధమాన మార్కెట్ల ఈక్విటీల ఆకర్షణ తగ్గే అవకాశం ఉంటుంది. మరోవైపు, భారత్‌కు అధిక ముడి చమురు ధరలు దిగుమతి బిల్లును పెంచే ప్రమాదం ఉంది. దీనివల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి, కరెంట్ అకౌంట్‌పై భారం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే రూపాయి బలహీనత కూడా పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది.
బలమైన రికవరీ కష్టమేనా..
అక్టోబర్‌లో మార్కెట్లు కొంత స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ వెంటనే బలమైన రికవరీ వస్తుందని విశ్లేషకులు భావించడం లేదు. సిద్ధార్థ్ సోగాని జైన్ ప్రకారం అక్టోబర్‌లో మార్కెట్ రెండు వేగాలతో కదిలే అవకాశం ఉంది. పండుగల సందర్భంగా పెరిగే వినియోగ డిమాండ్, ప్రభుత్వ వ్యయం, రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభం వంటి అంశాలు పెద్ద బ్యాంకులు, ఎంపిక చేసిన తయారీ సంస్థలు, దేశీయ వినియోగ ఆధారిత కంపెనీలకు మద్దతు ఇస్తాయని చెప్పారు. అయితే ఇవి మాత్రమే విదేశీ పెట్టుబడులను తిరిగి ఆకర్షించడానికి సరిపోవని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్‌లో మార్కెట్ స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ, వచ్చే మూడు నెలల్లో స్పష్టమైన రికవరీ రావాలంటే ముడి చమురు ధరలు, అమెరికా బాండ్ రాబడులపై పరిస్థితులు మారాల్సి ఉంటుందని జైన్ తెలిపారు. దేశీయ డిమాండ్ ఒక్కటే మార్కెట్ రికవరీకి సరిపోదని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ వరకు ఒడిదుడుకులతో కూడిన రికవరీ తమ ప్రాథమిక అంచనాగా ఉందని, రికవరీ వస్తే పెద్ద కంపెనీల షేర్లు ముందుండే అవకాశం ఉందని తెలిపారు. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లకు మరింత సమయం పడుతుందని, పెట్టుబడిదారులు దేశీయ ఆదాయ వృద్ధి, సముచిత విలువలు, బలమైన బ్యాలెన్స్‌షీట్లపై దృష్టి పెట్టాలని సూచించారు.

అప్రమత్తత అవసరం..
మంగళ్ కేశవ్ ఫైనాన్షియల్ చైర్మన్ పరేష్ భగత్ కూడా మార్కెట్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ప్రపంచ బాండ్ రాబడులు, రూపాయి విలువ అనే మూడు అంశాలను తాను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. స్థిరమైన, గణనీయమైన మార్కెట్ రికవరీ రావాలంటే ఈ మూడింటిలో కనీసం రెండు అంశాలు మెరుగుపడాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. దేశీయ లిక్విడిటీ మార్కెట్ పతనాన్ని కొంతవరకు అడ్డుకోగలిగినప్పటికీ, విదేశీ అమ్మకాలు కొనసాగితే దీర్ఘకాలిక రికవరీ కష్టమవుతుందని పేర్కొన్నారు. మార్కెట్‌లకు తదుపరి కీలక పరీక్ష రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలేనని, కంపెనీల ఆదాయ వృద్ధి, మార్జిన్లు, యాజమాన్యాల భవిష్యత్ అంచనాలపై మార్కెట్ ప్రత్యేకంగా దృష్టి సారించనుందని తెలిపారు.
ముడి చమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు కీలకంగానే కొనసాగుతాయని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న రుతుపవన పరిస్థితులు కూడా మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తాయని తెలిపారు. పండుగల సమయంలో పెరిగే డిమాండ్ ఎఫ్‌ఎంసీజీ, ఆటో కంపెనీలకు మద్దతు ఇస్తుందని, అయితే ఆ డిమాండ్ ఎంత బలంగా ఉంటుందన్నదే ఆ మద్దతు ఎంతకాలం కొనసాగుతుందో నిర్ణయిస్తుందని వివరించారు.
అన్ని రంగాల్లో రికవరీ సాధ్యమేనా..
బొనాంజా రీసెర్చ్ అనలిస్ట్ ఖుషీ మిస్త్రీ ప్రకారం ఇటీవల వచ్చిన మార్కెట్ కరెక్షన్ షేర్ల విలువలను కొంతవరకు రీసెట్ చేసిందన్నారు. అయితే అక్టోబర్‌లో వెంటనే వి-ఆకారపు రికవరీ కంటే ఒడిదుడుకులు కొనసాగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. సమీప కాలంలో మార్కెట్‌లను ప్రభావితం చేసే ప్రధాన అంశాల్లో ముడి చమురు ధరలు, అమెరికా బాండ్ రాబడులు, ఎఫ్‌పీఐల పెట్టుబడుల ప్రవాహం, రూపాయి విలువ, రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఉన్నాయని మిస్త్రీ తెలిపారు. నవంబర్-డిసెంబర్‌లో మార్కెట్ పరిస్థితులు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, రికవరీ అన్ని రంగాల్లో ఒకే విధంగా కాకుండా ఎంపిక చేసిన కంపెనీల ఆదాయ ఫలితాల ఆధారంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Stock Recommendations | బాండ్ల రాబడితో మారిన లెక్కలు.. ఈ 5 స్టాక్స్‌పై ఓ కన్నేయండి..
అక్టోబర్ 3, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లు భారీగా పతనం.. వారం రోజుల్లో రూ.20 లక్షల కోట్లు ఆవిరి..
అక్టోబర్ 1, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర.. భారీ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు..
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేయాలి
- ●Uttam Kumar Reddy | గౌరవెల్లి భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Vaishnavi Chaitanya | ఓటీటీలోకి వైష్ణవి చైతన్య రొమాంటిక్ మూవీ - లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్లతో జెన్‌జీ లవ్‌స్టోరీ
- ●CJP | అక్టోబర్ 10న చలో జంతర్ మంతర్.. సీజేపీ కీలక ప్రకటన
- ●Janhvi Kapoor |జాన్వీకపూర్ డీప్ ఫేక్ వీడియో - ఎవరిని వదిలిపెట్టనంటూ జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్
- ●Man Jumps Off 43rd Floor | షాకింగ్.. 43వ అంతస్తు నుంచి దూకిన వ్యక్తి.. రెండు ముక్కలైన బాడీ

Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేయాలి

Uttam Kumar Reddy | గౌరవెల్లి భూసేకరణ, పునరావాస ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Vaishnavi Chaitanya | ఓటీటీలోకి వైష్ణవి చైతన్య రొమాంటిక్ మూవీ - లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్లతో జెన్‌జీ లవ్‌స్టోరీ

CJP | అక్టోబర్ 10న చలో జంతర్ మంతర్.. సీజేపీ కీలక ప్రకటన



