Ajit Doval | అజిత్ దోవల్‌కు లోక్‌మాన్య తిలక్ జాతీయ అవార్డు
Ajit Doval | జాతీయ భద్రత సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval)కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు లోక్‌మాన్య తిలక్ జాతీయ అవార్డు (Lokmanya Tilak National Award) వరించింది.
Ajit Doval | త్రినేత్ర.న్యూస్ : జాతీయ భద్రత సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval)కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు లోక్‌మాన్య తిలక్ జాతీయ అవార్డు (Lokmanya Tilak National Award) వరించింది. పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈ అవార్డును అజిత్ దోవల్‌కు అందజేశారు.
లోక్‌మాన్య తిలక్ జాతీయ అవార్డు (Lokmanya Tilak National Award) అనేది దేశాభివృద్ధి కోసం విశేషమైన, అసాధారణమైన కృషి చేసిన వ్యక్తులను గౌరవించేందుకు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బాల గంగాధర తిలక్ స్మారకార్థం పుణెలోని 'తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్' 1983లో ఈ అవార్డును ప్రదానం చేయడం ప్రారంభించింది. ఏటా ఆగస్టు 1వ తేదీన బాల గంగాధర తిలక్ వర్ధంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేస్తూ వస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును మొట్టమొదటగా ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు ఎస్.ఎమ్. జోషి అందుకున్నారు. విజేతకు ఒక మెమొంటో, ప్రశంసా పత్రంతోపాటూ రూ.లక్ష నగదును బహుమతిగా ఇస్తారు. ఇక దేశ ప్రయోజనాల రక్షణ కోసం సేవ చేసిన అజిత్ దోవల్‌ను ఈ ఏడాది అవార్డు కోసం ఎంపిక చేశారు. దేశ భద్రత, కౌంటర్ టెర్రరిజం, బోర్డర్ సెక్యూరిటీ విభాగాల్లో ఆయన చేసిన సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.
#WATCH | Maharashtra: Union Home Minister Amit Shah presents Lokmanya Tilak National Award to NSA Ajit Doval, in Pune. pic.twitter.com/sXq0UmkA4j
— ANI (@ANI) August 1, 2026
Also Read..
దేశ విమానయాన రంగంలో అసాధారణ పురోగతి.. 12 ఏళ్లలో 166 ఎయిర్‌పోర్టులు : ప్రధాని మోదీ
తాజావార్తలు
- ●Saleem Pasha | రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించే కుట్ర : సలీం పాషా
- ●MK Stalin | స్టాలిన్ సూట్‌కేట్ భామ వ్యాఖ్యలపై దుమారం.. భగ్గుమన్న నేతలు
- ●Revanth Reddy | ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి
- ●John Wesley | 'సర్' పేరుతో 13 కోట్ల ఓట్ల తొలగింపు
- ●Stock Markets | అక్టోబర్‌లో మార్కెట్లకు మరో పరీక్ష.. కీలకం ఈ 5 అంశాలే..
- ●Mahesh Kumar Goud | జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేయాలి

Saleem Pasha | రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించే కుట్ర : సలీం పాషా

MK Stalin | స్టాలిన్ సూట్‌కేట్ భామ వ్యాఖ్యలపై దుమారం.. భగ్గుమన్న నేతలు

Revanth Reddy | ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచండి

John Wesley | 'సర్' పేరుతో 13 కోట్ల ఓట్ల తొలగింపు






