Harsh Goenka | దాబేలీ.. బర్గర్ కంటే చాలా రుచికరంగా ఉంటుంది
Harsh Goenka | ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) గుజరాతీ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ దాబేలీ (Dabeli) గురించి నెటిజన్లకు పరిచయం చేశారు. ఇది బర్గర్ (Burger) కంటే చాలా రుచికరంగా ఉంటుందని తెలిపారు.
Harsh Goenka | త్రినేత్ర.న్యూస్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ (RPG Group) చైర్మన్ హర్ష గోయెంకా (Harsh Goenka) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తరచూ ఆసక్తికర విషయాలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రజలకు చేరువలో ఉంటుంటారు. ఆయన షేర్ చేసే వీడియోలు, పోస్టులు ప్రజలకు స్ఫూర్తిని కలిగించేవిగా ఉంటాయి. తాజాగా ఆయన ఓ స్ట్రీట్ ఫుడ్ (Gujarati Street Snack)ను నెటిజన్లకు పరిచయం చేశారు. అదే గుజరాతీ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ దాబేలీ (Dabeli). ఇది బర్గర్ (Burger) కంటే చాలా రుచికరంగా ఉంటుందని తెలిపారు.
బంగాళాదుంప మిశ్రమం, చట్నీలు, వేరుశనగలు, సేవ్, దానిమ్మ గింజల కలయికతో దీని స్టఫ్ ఉంటుందని చెప్పారు. తియ్యగా, కారంగా, పుల్లగా, క్రంచీగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ వంటకం ఎవరికైనా ఆకలి పుట్టించేలా ఉంటుందని తెలిపారు. తాను వడాపావ్ (vada pav), బర్గర్ కంటే దాబేలీనే ఎక్కువగా ఇష్టపడతానని చెప్పుకొచ్చారు. ముంబై, గుజరాత్ వెలుపల ఉన్న చాలా మందికి ఈ అద్భుతమైన వంటకం గురించి పెద్దగా తెలియదని చెప్పారు. ఈ గుజరాత్ వంటకాన్ని బర్గర్‌కు సరైన సమాధానంగా ఆయన అభివర్ణించారు. ఈ దాబేలీ ఫుడ్ తాయరీ విధానానికి సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
దాబేలీ స్పెషల్..
గుజరాత్ ప్రత్యేక వంటకాల్లో కచ్ దాబేలీ (Kutch Dabeeli)కి ప్రత్యేక స్థానం ఉంది. ఇది చూడటానికి బర్గర్‌లానే ఉంటుంది. తియ్యగా, పుల్లగా, కారంగా నోటికి చాలా రుచికరంగా ఉంటుంది. ఉడకబెట్టిన బంగాళాదుంపల్లో ప్రత్యేకమైన దాబేలీ మసాలాను కలిసి స్టఫింగ్ తయారు చేస్తారు. తీపి కోసం ఖర్జూరం-చింతపండు చట్నీ, కారం కోసం వెల్లుల్లి-ఎండుమిర్చి చట్నీలను వాడతారు. ప్రత్యేకంగా మసాలా దట్టించిన వేరుశనగలు క్రంచీనెస్‌ను ఇస్తాయి. దాబేలీ లోపలా పైన సేవ్, దానిమ్మ గింజలు, కొత్తిమీరతో గార్నిషింగ్ చేస్తారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్ వంటి ప్రధాన నగరాల్లోని ప్రతి స్ట్రీట్ ఫుడ్ సెంటర్‌లోనూ ఇది లభిస్తుంది. ఈ రుచికరమైన స్నాక్ గుజరాత్‌లోని కచ్ (Kutch) జిల్లాలోని మాండ్వి (Mandvi) పట్టణంలో పుట్టింది.
Dabeli is Gujarat’s answer to the burger 😋! A soft pav stuffed with spicy-sweet potato, chutneys, peanuts, sev and pomegranate. Sweet, spicy, crunchy and tangy. I much prefer it to vada pav and burger. Unfortunately most outside of Mumbai and Gujarat are unfamiliar with it! pic.twitter.com/15sW2qgTNw
— Harsh Goenka (@hvgoenka) August 17, 2026
Also Read..
ఉద్దేశపూర్వకంగానే కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కుట్ర : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
శబరిమలలో షూటింగ్‌లకు "నో" పర్మిషన్ - మోహన్‌లాల్ సినిమాకు అనుమతి నిరాకరణ
సిగ్గులేని చర్య.. సీఎం విజయ్-త్రిషపై మురసోలి కామెంట్స్
తాజావార్తలు
- ●Harish Rao | లైసెన్స్డ్ సర్వేయర్లకు జీతాలేవీ..? అడిగితే అరెస్టులు చేస్తారా..?
- ●National Sports Awards 2025 | తెలంగాణ బిడ్డలకు అర్జున అవార్డులు
- ●RS Praveen Kumar | ఉద్దేశపూర్వకంగానే కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కుట్ర : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Mohan Lal | శబరిమలలో షూటింగ్‌లకు "నో" పర్మిషన్ - మోహన్‌లాల్ సినిమాకు అనుమతి నిరాకరణ
- ●Bengaluru Double Murder | భర్త, కొడుకు టీవీలో బిగ్‌బాస్ చూసి నిద్రపోయాక.. గ్లౌజులు వేసుకుని మరీ హత్య చేసిన భార్య
- ●KCR Rule | కేసీఆర్ పాలనపై రేవంత్ విమర్శలు అర్థరహితం

Harish Rao | లైసెన్స్డ్ సర్వేయర్లకు జీతాలేవీ..? అడిగితే అరెస్టులు చేస్తారా..?

National Sports Awards 2025 | తెలంగాణ బిడ్డలకు అర్జున అవార్డులు

RS Praveen Kumar | ఉద్దేశపూర్వకంగానే కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కుట్ర : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Mohan Lal | శబరిమలలో షూటింగ్‌లకు "నో" పర్మిషన్ - మోహన్‌లాల్ సినిమాకు అనుమతి నిరాకరణ





