RS Praveen Kumar | ఉద్దేశపూర్వకంగానే కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కుట్ర : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | ఉద్దేశపూర్వకంగానే కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కళ్యాణ లక్ష్మిపై కౌంటర్ రెడీ అయ్యాక.. దాన్ని ఆపమని చెప్పింది ఎవరు? అని ప్రశ్నించారు.
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్ : ఉద్దేశపూర్వకంగానే కళ్యాణలక్ష్మి పథకం రద్దుకు కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కళ్యాణ లక్ష్మిపై కౌంటర్ రెడీ అయ్యాక.. దాన్ని ఆపమని చెప్పింది ఎవరు? అని ప్రశ్నించారు. హైకోర్టు నాలుగు సార్లు అవకాశం ఇచ్చినా.. ఎందుకు సిద్ధంగా ఉన్న కౌంటర్‌ను దాఖలు చేయలేదు? అని సీఎంను నిలదీశారు. తెలంగాణ భవన్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హైకోర్టు 8 జీవోలను రద్దు చేసింది. మరి ప్రభుత్వ న్యాయవాదులు ఏం చేస్తున్నారు? కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కి చట్టబద్ధత లేదని జూలై నెలలో న్యాయవాది కోర్టులో పిటిషన్ వేయగానే మీకు ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు మీ అధికారులు ఆగమేఘాల మీద పారా వైజ్ రిమార్క్స్ వేశారని మాకు సమాచారం వచ్చింది. ఆ పారా వైజ్ రిమార్క్స్ వచ్చిన తర్వాత కౌంటర్ దాఖలు చేయడానికి సమయంలో మీరు సెక్రటేరియట్‌కి పంపించారు. సెక్రటేరియట్‌కి పంపించినప్పుడు ఈ కౌంటర్‌ని అప్రూవ్ చేయాల్సింది లా డిపార్ట్‌మెంట్.. కానీ వాళ్లు అప్రూవ్ ఎందుకు చేయలేదు? న్యాయ శాఖ రేవంత్ రెడ్డి అధీనంలోనే ఉంది.. మరి కౌంటర్‌ని ఆపమని చెప్పింది ఎవరు? ముఖ్యమంత్రి కాదా? జీవోల ద్వారా అన్ని స్కీములు నడిపించవచ్చని స్పష్టంగా రాజ్యాంగంలో ఉంటే కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు అని ప్రశ్నించారు.
1955లోనే రామ్ జావాయ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా మీ అడిషనల్ అడ్వొకేట్ నోరు ఎందుకు మెదపలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో దళిత బంధు స్కీం, కల్యాణ లక్ష్మి స్కీం బెంచ్ మీదకి పోగానే అడ్మిషన్ స్టేజీలోనే వాటి మీద పడ్డ పిటిషన్లన్నీ ఎగిరిపోయాయి. ఆనాడు కేసీఆర్ ప్రజలకు పథకాలు ఇవ్వాలని సీరియస్‌గా ఉన్నారు కాబట్టి ఆ పిటిషన్లు కొట్టేయించారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Bengaluru Double Murder | భర్త, కొడుకు టీవీలో బిగ్‌బాస్ చూసి నిద్రపోయాక.. గ్లౌజులు వేసుకుని మరీ హత్య చేసిన భార్య
- ●KCR Rule | కేసీఆర్ పాలనపై రేవంత్ విమర్శలు అర్థరహితం
- ●Stock Markets | చమురు మంట.. మార్కెట్లకు వరుసగా షాకులు..
- ●KBR Park One Way | కేబీఆర్ పార్కు వన్ వే డ్రోన్ విజువల్..
- ●CM Vijay-Trisha | సిగ్గులేని చర్య.. సీఎం విజయ్-త్రిషపై మురసోలి కామెంట్స్
- ●Ethics Committee | ప్రజాస్వామ్య విలువను కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ

Bengaluru Double Murder | భర్త, కొడుకు టీవీలో బిగ్‌బాస్ చూసి నిద్రపోయాక.. గ్లౌజులు వేసుకుని మరీ హత్య చేసిన భార్య

KCR Rule | కేసీఆర్ పాలనపై రేవంత్ విమర్శలు అర్థరహితం

Stock Markets | చమురు మంట.. మార్కెట్లకు వరుసగా షాకులు..

KBR Park One Way | కేబీఆర్ పార్కు వన్ వే డ్రోన్ విజువల్..





