CM Vijay-Trisha | సిగ్గులేని చర్య.. సీఎం విజయ్-త్రిషపై మురసోలి కామెంట్స్
CM Vijay-Trisha | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో (Independence Day) భాగంగా చారిత్రక ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరిగిన కార్యక్రమంలో చెన్నై క్వీన్ త్రిషకు ముఖ్యమంత్రి విజయ్ సెల్యూట్ చేయడంపై (CM Vijay-Trisha) డీఎంకే అధికార పత్రిక మురసోలి (Murasoli) తీవ్రంగా స్పందించింది. దీన్ని సిగ్గులేని చర్యగా అభివర్ణించింది.
CM Vijay-Trisha | త్రినేత్ర.న్యూస్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో (Independence Day) భాగంగా చారిత్రక ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరిగిన కార్యక్రమంలో చెన్నై క్వీన్ త్రిషకు ముఖ్యమంత్రి విజయ్ సెల్యూట్ చేయడం చర్చకు దారి తీస్తోంది. విజయ్ తీరును అటు నెటిజన్లు, ఇటు ప్రతిపక్ష డీఎంకే నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై డీఎంకే అధికార పత్రిక మురసోలి (Murasoli) తీవ్రంగా స్పందించింది. దీన్ని సిగ్గులేని చర్యగా అభివర్ణించింది.
"స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి విజయ్ గౌరవం గాల్లో కలిసిపోయింది. ఎలాంటి సిగ్గు, సంకోచం లేకుండా ఒక నటిని ముందు వరుసలో కూర్చోబెట్టి, ఆమెతో పరస్పరం సెల్యూట్ చేసుకున్నారు. ఆయనకు ఓటు వేసిన వారు కూడా ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోయారు" అని ఆ నటి పేరును ప్రస్తావించకుండా మురసోలి తీవ్ర పదజాలంతో దూషించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఓ నటిని తీసుకురావడం, ఆమెకు సెల్యూట్ చేయడం వంటి చర్యలను విజయ్ అభిమానులు కూడా అంగీకరించలేకపోతున్నారని వ్యాఖ్యానించింది. అలాంటిది ఇక ప్రజలు ఎలా స్పందిస్తారు..? అంటూ ప్రశ్నించింది.
విజయ్-త్రిష.. ఓ సెల్యూట్
ఇండిపెండెన్స్ డే వేడుకలు జరిగిన ఫోర్ట్ సెయింట్ జార్జ్‌కు వచ్చిన త్రిషకు అధికారులు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. త్రిషకు బాడీగార్డ్‌లా ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ రక్షణ కల్పించింది. ఆమెను దగ్గరుండి మొదటి వరుసలో కూర్చొబెట్టారు. స్వాతంత్య్ర దినోవత్స వేడుకల్లో పాల్గొన్న కొందరు టీవీకే మినిస్టర్లు, నాయకులతో పాటు చాలా మంది అధికారులు త్రిష వెనుక వరుసలో కూర్చున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వేడుకల్లో భాగంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తూ ముందుకు సాగిన సీఎం విజయ్ ... త్రిషకు ప్రత్యేకంగా సెల్యూట్ చేశాడు. త్రిష కూడా విజయ్ స్టైల్‌లోనే తిరిగి అతడికి సెల్యూట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో త్రిషకు విజయ్ టీవీకే ప్రభుత్వం వీఐపీలా రాచ మర్యాదలు చేయడంపై నెటిజన్లు సైతం ట్రోల్ చేస్తున్నారు.
Also Read..
ప్రజాస్వామ్య విలువను కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ
జైలు నుంచి ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అసలు ఆయన ఆరోగ్యానికి ఏమైంది?
CJP పార్లమెంట్ మార్చ్ చట్టవిరుద్ధం.. అక్రమంగా బలప్రయోగం చేయలేదు : ఢిల్లీ పోలీసులు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Vijay | అసెంబ్లీలో ప్రతిపక్షానికి క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్.. ఎందుకంటే..?
ఆగస్టు 18, 2026

Jana Nayagan OTT | అఫీషియల్ – ఓటీటీలోకి సీఎం విజయ్ చివరి మూవీ – తెలుగు ఫ్యాన్స్‌కు నిరాశే!
ఆగస్టు 17, 2026

Trisha | తల్లి చీరలో మెరిసిన త్రిష – చెన్నై క్వీన్ కొత్త ఫొటోలపై ఓ లుక్కేయండి!
ఆగస్టు 16, 2026
తాజావార్తలు
- ●Imran Khan Health Update | జైలు నుంచి ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అసలు ఆయన ఆరోగ్యానికి ఏమైంది?
- ●Mahesh Kumar Goud | 73 లక్షల ఓట్లు డిలీట్ చేశారు.. 60 లక్షల ఓట్లు డౌట్‌ఫుల్‌గా ఉన్నయ్
- ●Ponguleti Srinivas Reddy | అబద్ధాలతో హరీశ్‌రావు డ్రామాలు : మంత్రి పొంగులేటి
- ●Taapsee | తల్లి పాత్రలో తాప్సీ - గ్లామర్ పాత్రలే చేయాలని రూలు లేదంటూ ట్రోల్స్‌పై ఫైర్
- ●Supreme Court | ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టాలని పిల్.. కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు..
- ●Delhi Police | CJP పార్లమెంట్ మార్చ్ చట్టవిరుద్ధం.. అక్రమంగా బలప్రయోగం చేయలేదు : ఢిల్లీ పోలీసులు

Imran Khan Health Update | జైలు నుంచి ఆసుపత్రికి ఇమ్రాన్ ఖాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అసలు ఆయన ఆరోగ్యానికి ఏమైంది?

Mahesh Kumar Goud | 73 లక్షల ఓట్లు డిలీట్ చేశారు.. 60 లక్షల ఓట్లు డౌట్‌ఫుల్‌గా ఉన్నయ్

Ponguleti Srinivas Reddy | అబద్ధాలతో హరీశ్‌రావు డ్రామాలు : మంత్రి పొంగులేటి

Taapsee | తల్లి పాత్రలో తాప్సీ - గ్లామర్ పాత్రలే చేయాలని రూలు లేదంటూ ట్రోల్స్‌పై ఫైర్



