త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Badam Ki Jali | హైద‌రాబాద్ అంటే బిర్యానీ మాత్ర‌మే కాదు.. 200 ఏళ్ల నాటి నిజామీ మిఠాయి గురించి తెలుసా..?

Badam Ki Jali | హైద‌రాబాద్ అన‌గానే అంద‌రికీ ఠ‌క్కున‌ గుర్తొచ్చేది నోరూరించే బిర్యానీనే. అయితే, బిర్యానీ, హ‌లీమ్ మాత్రమే కాకుండా న‌గ‌రంలోని అత్యంత అరుదైన మ‌రో స్వీట్ కూడా ఉంది. అదే 'బాదం కి జాలీ' (Badam ki Jali).

D

National | Published On Oct 1, 2026, 12.40 pm IST

Badam Ki Jali | హైద‌రాబాద్ అంటే బిర్యానీ మాత్ర‌మే కాదు.. 200 ఏళ్ల నాటి నిజామీ మిఠాయి గురించి తెలుసా..?
Advertisement

Badam Ki Jali | త్రినేత్ర న్యూస్ : హైద‌రాబాద్ అన‌గానే అంద‌రికీ ఠ‌క్కున‌ గుర్తొచ్చేది నోరూరించే బిర్యానీనే. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌కు అంతటి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది కూడా ఇక్కడి బిర్యానీ రుచే. ఘుమఘుమలాడే మసాలాలు, బాస్మతీ బియ్యం, ప్రత్యేకమైన దమ్ పద్ధతిలో వండే విధానం దీనికి ఆ ప్రత్యేకమైన టేస్ట్‌ను ఇస్తాయి. బిర్యానీతోపాటూ హ‌లీమ్‌కు కూడా హైద‌రాబాద్ ఫేమ‌స్‌. న‌గ‌రానికి వ‌చ్చిన వారు వీటిని టేస్ట్ చేయ‌కుండా తిరిగి వెళ్ల‌రు.

అయితే, బిర్యానీ, హ‌లీమ్ మాత్రమే కాకుండా న‌గ‌రంలోని అత్యంత అరుదైన మ‌రో స్వీట్ కూడా ఉంది. అదే 'బాదం కి జాలీ' (Badam ki Jali). దీని గురించి ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. హైదరాబాద్‌లోనే అత్యంత ప్రత్యేకమైన, సంప్ర‌దాయ‌క మిఠాయి. దీని గురించి ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ (RPG Group) చైర్మన్ హర్ష గోయెంకా (Harsh Goenka) తాజాగా ఎక్స్ వేదిక‌గా పోస్టు పెట్టారు. ఇది సుమారు 200 సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన నిజాంల కాలం నాటి వంటక‌మ‌ని పేర్కొన్నారు. దీని గురించి బ‌య‌ట అంత‌గా ఎవ‌రికీ తెలియ‌ద‌ని చెప్పారు.

ఎలాంటి కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్స్ లేకుండా కేవలం బాదం పప్పులు, పంచదార, యాలకలతో.. అంద‌మైన డిజైన్ల‌లో దీన్ని త‌యారు చేస్తారు. నోట్లే వేసుకుంట‌నే క‌రిగిపోయేంత మృదువుగా ఉంటుంద‌ట‌. నట్ ఫ్లేవర్‌తో, మరీ ఎక్కువ తియ్యగా లేకుండా నోటికి ఎంతో రుచిక‌రంగా ఉంటుంద‌ని హర్ష గోయెంకా వివ‌రించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ తెగ వైర‌ల్ అవుతోంది.

ఈ మిఠాయి విష‌యానికొస్తే.. ఆర్కాట్ (తమిళనాడు) ప్రాంతానికి చెందిన ముస్లిం కుటుంబాల ద్వారా ఇది హైదరాబాద్‌కు పరిచయం అయిందని చెప్తారు. పాతబస్తీలోని కొన్ని కుటుంబాలు ఈ మిఠాయిని ఇప్ప‌టికీ ఎంతో సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో త‌యారు చేస్తుంటారు. పాతబస్తీ సంస్కృతిలో జరిగే పెళ్లిళ్లు, నిశ్చితార్థాలు, ప్రత్యేక పండగల్లో 'బాదం కి జాలీ'ని వడ్డించడం అంత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ స్వీట్ ఎంతో క‌ళాత్మ‌కంగా ఉంటుంది.

Also Read..

కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్‌.. పీసీసీ చీఫ్ రాజీనామా

ట్రంప్ ప్ర‌భుత్వంలోకి మ‌స్క్ రీ ఎంట్రీ.. అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యతలు

ఫారమ్-6లో మార్పులు చేయ‌మ‌ని టీసీఎస్‌ను ఎవ‌రు ఆదేశించారు..? ఎన్నిక‌ల సంఘాన్ని ప్ర‌శ్నించిన రాహుల్‌

Advertisement
Advertisement