త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mohan Lal | శ‌బ‌రిమ‌ల‌లో షూటింగ్‌ల‌కు “నో” ప‌ర్మిష‌న్ – మోహ‌న్‌లాల్ సినిమాకు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

శ‌బ‌రిమ‌ల‌లో సినిమా షూటింగ్‌లు చేయ‌డంపై కేర‌ళ హైకోర్టు కీల‌క తీర్చు ఇచ్చింది. శ‌బ‌రిమ‌ల‌తో పాటు అనుబంధంగా ఉన్న పెరియార్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో ఎలాంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాల చిత్రీక‌ర‌ణ‌ల‌ను జ‌రుప‌డానికి వీలులేద‌ని హైకోర్టు అన్న‌ది. మోహ‌న్‌లాల్ సినిమా షూటింగ్‌కు అనుమ‌తి నిరాక‌రించింది.

N

News | Published On Aug 18, 2026, 4.26 pm IST

Mohan Lal | శ‌బ‌రిమ‌ల‌లో షూటింగ్‌ల‌కు “నో” ప‌ర్మిష‌న్ – మోహ‌న్‌లాల్ సినిమాకు అనుమ‌తి నిరాక‌ర‌ణ‌
Advertisement

Mohan Lal | శబరిమల ఆల‌యంలో ఇక‌పై సినిమా షూటింగ్‌ల‌కు అనుమ‌తి లేదంటూ కేర‌ళ హైకోర్టు ప్ర‌క‌టించింది. శ‌బ‌రిమ‌ల ఆల‌యంతో పాటు దానికి అనుబంధంగా ఉన్న పెరియార్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో సినిమా షూటింగ్‌ల‌ను చేయ‌రాద‌ని వెల్ల‌డించింది. మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తోన్న అతి మ‌నోహ‌రం సినిమా షూటింగ్‌కు అనుమ‌తిని నిరాక‌రించ‌డం మ‌ల‌యాళ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ...

మోహ‌న్‌లాల్ హీరోగా త‌రుణ్ మూర్తి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న అతిమ‌నోహ‌రం పేరుతో ఓ మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. క‌థానుగుణంగా శ‌బ‌రిమ‌ల స‌న్నిధానంతో పాటు పంబ ప‌రిస‌ర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ను జ‌ర‌పాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. అనుమ‌తుల కోసం అట‌వీ అధికారుల‌ను చిత్ర‌బృందం సంప్ర‌దించింది. వారు నిరాక‌రించ‌డంతో మేక‌ర్స్ కోర్టును ఆశ్ర‌యించారు.

శ‌బ‌రిమ‌ల స‌న్నిధానంలో...

ఈ పిటీష‌న్‌పై మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిగింది. శ‌బ‌రిమ‌ల స‌న్నిధానంతో పాటు పంబ ప‌రిస‌ర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ల‌కు ప‌ర్మిష‌న్ లేదంటూ కోర్టుకు పెరియార్ టైగ‌ర్ రిజ‌ర్వ్ అధికారులు వెల్ల‌డించారు. శ‌బ‌రిమ‌ల భ‌క్తుల కోస‌మే అట‌వీ భూముల‌ను దేవాల‌య‌ బోర్డుకు లీజుకు ఇచ్చామ‌ని వెల్ల‌డించారు. వైల్డ్‌లైఫ్ శాంక్చురీలు, నేషనల్ పార్కులు, టైగర్ రిజర్వ్‌లలో సినిమా షూటింగ్‌లు చేయ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింద‌ని పేర్కొన్నారు. పెరియార్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌ అధికారుల వాద‌న‌ల‌తో కోర్టు ఏకీభ‌వించింది. అట‌వీ శాఖ నిర్ణ‌యాల్లో జోక్యం చేసుకోలేమ‌ని వెల్ల‌డించింది.

భ‌క్తి క‌థ‌లే...

ఈ వివాదంపై కేర‌ళ దేవాద‌య శాఖ మంత్రి కే ముర‌ళీధ‌ర్ కూడా స్పందించారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల షూటింగ్‌ల‌ను ఈ ప్రాంతంలో చిత్రీక‌రించ‌డం వ‌ల్ల వ‌ల్ల దేవాల‌య ప‌విత్ర‌త దెబ్బ‌తిన‌డ‌మే కాకుండా ప్ర‌కృతి వ‌న‌రులు, ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. అందుకే మోహ‌న్‌లాల్ సినిమా అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని అన్నారు.

క్రిస్మ‌స్‌కు రిలీజ్‌...

అతి మ‌నోహ‌రం సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో మోహ‌న్‌లాల్ క‌నిపించ‌బోతున్నాడు. తుడ‌రుం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మోహ‌న్‌లాల్‌, త‌రుణ్ మూర్తి డైరెక్ష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ ఏడాది క్రిస్‌మ‌స్‌కు సినిమాను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

 

 

 

Advertisement
Advertisement