Harsh Goenka | 2033 వరకు ఈ 9 ఉద్యోగాలకు ఏఐ వల్ల ముప్పు: హర్ష గోయెంకా
Harsh Goenka | కృత్రిమ మేధస్సు (AI) పని చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. పరిశ్రమలను పునర్నిర్వచిస్తోంది. ఉద్యోగాల స్వరూపాన్ని మార్చేస్తోంది. ఆటోమేషన్, డేటా ఆధారిత నిర్ణయాల దిశగా గ్లోబల్ ఆర్థిక వ్యవస్థను వేగంగా నడిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్, పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా ఎక్స్‌లో చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది.
Harsh Goenka | కృత్రిమ మేధస్సు (AI) పని చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. పరిశ్రమలను పునర్నిర్వచిస్తోంది. ఉద్యోగాల స్వరూపాన్ని మార్చేస్తోంది. ఆటోమేషన్, డేటా ఆధారిత నిర్ణయాల దిశగా గ్లోబల్ ఆర్థిక వ్యవస్థను వేగంగా నడిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్, పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా ఎక్స్‌లో చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడు సంవత్సరాల్లో ఏఐ కారణంగా పూర్తిస్థాయి వృత్తులే అంతరించిపోవచ్చని ఆయన హెచ్చరించారు. 2028 నుంచి 2033 వరకు ఏయే రంగాలకు చెందిన ఉద్యోగాల్లో మార్పులు సంభవించవచ్చు, ఏయే ఉద్యోగాలకు ఏఐ వల్ల ముప్పు ఏర్పడుతుంది.. అన్న వివరాను ఆయన వెల్లడించారు. దీంతో ఆయన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
2028 నాటికి ఏఐ ద్వారానే పూర్తిగా కోడింగ్..
2028 నాటికి కోడింగ్ రంగం పూర్తిగా మారిపోవచ్చని గోయెంకా అభిప్రాయ పడ్డారు. ఏఐ కేవలం అసిస్టెంట్ గానే కాకుండా స్వతంత్రంగా కోడ్ రాసి నిర్వహించి ఆప్టిమైజ్ చేసే స్థాయికి చేరవచ్చని అన్నారు. ఉన్నత స్థాయి డెవలపర్ బృందాలు అవసరం లేకుండా సిస్టమ్స్ పనిచేసే పరిస్థితి రావచ్చని అంచనా వేశారు. అలాగే 2029 నాటికి ఆటోనమస్ డ్రైవింగ్ రావచ్చని అంచనా వేశారు. టాక్సీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, డెలివరీ సిబ్బంది వంటి వృత్తులపై భారీ ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఇక ప్రతి విద్యార్థికి 24 గంటలు అందుబాటులో ఉండే ఏఐ ట్యూటర్ వ్యవస్థ రావొచ్చని, 2029 నాటికి వ్యక్తిగతీకరించిన బోధన సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది సంప్రదాయ తరగతి గదుల విధానాన్ని మార్చవచ్చని అన్నారు.
2030 వరకు వైద్య రంగంలో..
2030 నాటికి లక్షణాలు, స్కానింగ్, వైద్య చరిత్రలను వేగంగా విశ్లేషించే ఏఐ వ్యవస్థలు మానవ వైద్యుల కంటే కచ్చితంగా నిర్ధారణ చేయగలవని అంచనా వేశారు. అలాగే ఏఐ ఆధారిత చిత్రాలు, సంగీతం, రచనలు ఇప్పటికే పెరుగుతున్నాయని, 2030 నాటికి సృజనాత్మక రంగాలపై భారీ ప్రభావం ఉండవచ్చని అన్నారు. 2031 నాటికి ఒప్పందాల రూపకల్పన, కేస్ సమ్మరీలు, లీగల్ రీసెర్చ్ వంటి పనులు ఏఐ నిర్వహించే అవకాశం ఉందని, దీని వల్ల జూనియర్ లాయర్లు, పారాలీగల్స్ డిమాండ్ తగ్గవచ్చని పేర్కొన్నారు. ఇక 2031 నాటికి అనేక ఫ్యాక్టరీలు పూర్తిగా ఆటోమేటెడ్ కావచ్చని అంచనా వేశారు. రోబోలు 24 గంటలు పనిచేసే స్థితి వస్తే మానవ కార్మికుల పాత్ర తగ్గవచ్చని అన్నారు. 2032 నాటికి ఏఐ ఆధారిత రోబోటిక్ సర్జరీలు కచ్చితత్వం పెంచి, మానవ సర్జన్ల పాత్రను పర్యవేక్షణ, వ్యూహాత్మక నిర్ణయాల వరకే పరిమితం చేయవచ్చని అన్నారు.
కొత్త అవకాశాలను సృష్టించేలా ఆలోచించాలి..
2033 నాటికి స్వయంచాలక యుద్ధ వ్యవస్థలు రీకానిసెన్స్, వ్యూహాత్మక నిర్ణయాలు, దాడి చర్యల్లో కీలక పాత్ర పోషించవచ్చని గోయెంకా అంచనా వేశారు. అయితే ఆయన చెప్పిన విషయాలు ఆశ్చర్యంగా ఏమీ లేవని, అవి జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. కానీ అనేక ఉద్యోగాలకు ముప్పు ఉందని తెలుస్తుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ మానవ పాత్రలను పూర్తిగా భర్తీ చేయలేదు. కానీ కొత్త నైపుణ్యాలు అవసరం అవుతాయని అభిప్రాయపడ్డారు. సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, భావోద్వేగ మేధస్సు, అనుకూలత వంటివి ఏఐకి ఉండవని తెలిపారు. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు అన్న విషయంపై ఆందోళన పక్కన పెట్టి ఏఐ వల్ల కొత్త అవకాశాలను ఎలా సృష్టించవచ్చు అన్న విషయంపై ఆలోచిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు.
సంబంధిత వార్తలు

Harsh Goenka | మీ జీవితాన్ని మార్చే 3-30-300 రూల్.. హర్ష్ గోయెంకా చెప్పిన సక్సెస్ సీక్రెట్..
జులై 7, 2026

Supreme Court | న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగంపై సుప్రీం ఆందోళన.. నిర్ణయాధికారం పూర్తిగా మనుషుల నియంత్రణలోనే ఉండాలని స్పష్టీకరణ
జులై 2, 2026

Anthropic | ఏఐ యూజర్లకు గుడ్ న్యూస్.. క్లాడ్ ఫేబుల్, మైథోస్ తిరిగి అందుబాటులోకి..
జులై 2, 2026
తాజావార్తలు
- ●HCU Admissions | హెచ్‌సీయూలో యూజీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ●E20 Petrol | E20 పెట్రోల్‌పై భయాలు అవసరం లేదు.. ఆటోమొబైల్ నిపుణుడి కీలక వ్యాఖ్యలు..
- ●RS Praveen Kumar | భూ భారతి పోర్టల్ దొంగలు రేవంత్, పొంగులేటే
- ●E20 fuel | E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవదని లిఖితపూర్వక హామీ ఇవ్వండి.. వాహన తయారీ సంస్థలను కోరిన కేజ్రీవాల్
- ●Pune Ketan Agarwal Death Case | కేతన్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్: కాబోయే భర్తను చంపకముందే ప్రియుడిని పెళ్లాడిన సియా!
- ●Sanju Samson | 12 బంతుల్లోనే నమ్మకం పోయిందా? ప్రపంచకప్ హీరో శాంసన్‌ను పక్కన పెట్టేశారా?

HCU Admissions | హెచ్‌సీయూలో యూజీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

E20 Petrol | E20 పెట్రోల్‌పై భయాలు అవసరం లేదు.. ఆటోమొబైల్ నిపుణుడి కీలక వ్యాఖ్యలు..

RS Praveen Kumar | భూ భారతి పోర్టల్ దొంగలు రేవంత్, పొంగులేటే

E20 fuel | E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవదని లిఖితపూర్వక హామీ ఇవ్వండి.. వాహన తయారీ సంస్థలను కోరిన కేజ్రీవాల్



