DMK Defeat | విజయ్ దెబ్బ.. స్టాలిన్ అబ్బ.. డీఎంకే ఓటమికి కారణాలు ఇవే..!
DMK Defeat | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే పార్టీకి గట్టి షాక్ తగిలింది. డీఎంకే మూడోస్థానానికి పడిపోయింది. గత ఎన్నికల్లో 133 స్థానాల్లో గెలుపొందిన డీఎంకే.. ప్రస్తుత ఎన్నికల్లో 47 స్థానాల ఆధిక్యంతో మూడో స్థానాన్ని సరిపెట్టుకుంది. డీఎంకే ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, పాలనా వైఫల్యాలు, శాంతిభద్రతలు, విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అనూహ్యంగా పుంజుకోవడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
- ఓటమి అంచున తండ్రీ, కొడుకు
- వెనుకంజలో 32 మంది మంత్రులు
- ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
DMK Defeat | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఎర్లీ ట్రెండ్‌లో డీఎంకే మూడోస్థానానికి పడిపోయింది. ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. డీఎంకే కేవలం 47 స్థానాల్లో (కూటమి పార్టీలతో కలిపి 57) మాత్రమే ముందంజలో ఉంది. విజయ్ టీవీకే పార్టీ ఈ ఎన్నికల్లో ఊహించని ఫలితాలను రాబడుతోంది. ఏకంగా 112 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్‌కు (118) చేరువలోకి దూసుకెళ్తోంది. ఇక ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమి పార్టీ 65 స్థానాలతో రెండోస్థానంలో ఉంది. ఈ ఎన్నికలు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకి గట్టి షాకిచ్చాయి.
డీఎంకే ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, పాలనా వైఫల్యాలు, శాంతిభద్రతలు, విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అనూహ్యంగా పుంజుకోవడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. విజయ్ దెబ్బకు సీఎం స్టాలిన్, ఆయన తనయుడు ఉదనిధి స్టాలిన్ ఇద్దరూ వెనుకంజలో ఉండటం ఈ త్రిముఖ పోటీలో పెను సంచలనంగా మారింది.
ఓటర్ల అసంతృప్తికి కారణం..
రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఉన్నప్పటికీ డీఎంకే హయాంలో పెరిగిన రాష్ట్ర అప్పులు, ఆర్థిక దుర్వినయోగం, మితిమీరిన రుణాల పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అదేసమయంలో పాలనా పరమైన సమస్యలు కూడా డీఎంకేను ఓటమి అంచునకు నెట్టాయి. వ్యవసాయ రంగంలో కష్టాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, క్షేత్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వంటి అంశాలు ప్రభుత్వంపై నమ్మకాన్ని దెబ్బతీశాయి.
డీఎంకేపై ప్రజల్లో అసంతృప్తి..
ఈ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ 35 శాతానికిపైగా ఓట్ షేరింగ్ సాధించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను భారీగా చీల్చింది. యువత, తొలిసారి ఓటు వేసే ఓటర్లు DMKను కాదని TVK వైపు మొగ్గు చూపారు. ఎన్నికలకు ముందు పొత్తుల వల్ల డీఎంకే తిరుగులేని శక్తిగా కనిపించినప్పటికీ.. వారసత్వ రాజకీయాలు, కుటుంబపరమైన వివాదాలు ఆపార్టీకి ప్రతికూలంగా మారాయి. విద్యుత్ ఛార్జీల పెంపు, పన్నుల భారం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల మధ్యతరగతి ప్రజలు DMK ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
అవినీతి ఆరోపణలు..
ఇసుక మైనింగ్, పలువురు మంత్రులపై ఉన్న మనీలాండరింగ్ కేసులు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. అదే సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు కూడా డీఎంకే ఓటమికి ఓ కారణమే. పెరిగిన నేరాలు, మాదకద్రవ్యాల చలామణిపై మహిళా ఓటర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఉదయనిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎంగా నియమించడం వారసత్వ రాజకీయాలకు నిదర్శనమంటూ ప్రతిపక్షాలు చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇవే డీఎంకే కొంప ముంచాయి. సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సహా దాదాపు 32 మందికిపైగా మంత్రులు టీవీకే అభ్యర్థుల చేతుల్లో వెనుకంజలో ఉండటం.. ఈ ఎన్నికల్లో ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది.
Also Read..
విజిల్ మోత.. విజయ్ ఇంటికి త్రిష
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



