త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

West Bengal Election Results 2026 | పశ్చిమ బెంగాల్‌లో కాషాయ జెండా: హిందువుల సంఘటితంతోనే ఈ చారిత్రక విజయం అన్న సువేందు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రక విజయం దిశగా దూసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఏకంగా 198 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్న ఈ టైమ్‌లో పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి.

J

National | Published On May 4, 2026, 1.05 pm IST

West Bengal Election Results 2026 | పశ్చిమ బెంగాల్‌లో కాషాయ జెండా: హిందువుల సంఘటితంతోనే ఈ చారిత్రక విజయం అన్న సువేందు
Advertisement

West Bengal Election Results 2026 | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ సునామీ సృష్టిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 148 మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటేసి, ఏకంగా 198 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కేవలం 92 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండి తీవ్ర పరాజయం దిశగా పయనిస్తోంది. స్పష్టమైన ఆధిక్యం దిశగా ఫలితాలు వెలువడుతున్న ఈ టైమ్‌లో కౌంటింగ్ కేంద్రాల వద్ద బీజేపీ శ్రేణులు మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ చారిత్రక విజయంపై బీజేపీ కీలక నేత సువేందు అధికారి స్పందించారు. హిందువుల ఏకీకరణ, ఆదివాసీల ఓట్లతోనే బెంగాల్‌లో తమ పార్టీ ఘనవిజయం సాధించిందని ఆయన స్పష్టం చేశారు. చొరబాటుదారులకు, రాష్ట్ర భౌగోళిక ముఖచిత్రాన్ని మార్చే కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. హిందూ మహిళలు మూకుమ్మడిగా బీజేపీకి అండగా నిలిచారని, టీఎంసీ కేవలం బుజ్జగింపు రాజకీయాలకు మాత్రమే పరిమితమైందని సువేందు విమర్శించారు.

రాష్ట్రంలో 180కి పైగా సీట్లతో బీజేపీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు కీలక నియోజకవర్గాలైన నందిగ్రామ్, భవానీపూర్ నుంచి ఆయన బరిలో నిలిచారు. నందిగ్రామ్‌లో సువేందు ఆధిక్యంలో కొనసాగుతుండగా, ప్రతిష్టాత్మక భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేతిలో ఆయన వెనుకంజలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా కాషాయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుండటంతో, భవానీపూర్ కౌంటింగ్ కేంద్రం వెలుపల సైతం బీజేపీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ విజయోత్సాహంతో డ్యాన్సులు చేస్తున్నారు.

Advertisement
Advertisement