త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Womens Reservation Bill | మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు.. పాత చ‌ట్టాన్నే అమ‌లు చేయాలంటూ ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌

Womens Reservation Bill | పాత మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేయ‌నున్నాయి. ఇందులో భాగంగానే విప‌క్షాలు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)కి లేఖ రాయ‌నున్నాయి.

D

National | Published On Apr 18, 2026, 1.01 pm IST

Womens Reservation Bill | మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు.. పాత చ‌ట్టాన్నే అమ‌లు చేయాలంటూ ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌
Advertisement

Womens Reservation Bill | మహిళా రిజర్వేషన్ల (Women's Reservation) అమలును వేగవంతం చేయడంతో పాటు, కొత్త జనాభా లెక్కల అవసరం లేకుండానే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) చేపట్టేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కీలక బిల్లు లోక్‌స‌భ‌లో వీగిపోయిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో విప‌క్షాలు తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ బిల్లు వీగిపోయిన నేప‌థ్యంలో పాత మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేయ‌నున్నాయి. ఇందులో భాగంగానే విప‌క్షాలు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)కి లేఖ రాయ‌నున్నాయి.

పార్లమెంటరీ సీట్ల పెంపుతో సంబంధం లేకుండా, అంతకుముందు ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని లేఖ‌లో కోర‌నున్నాయి. అంతేకాదు, దీనిపై దేశ‌వ్యాప్తంగా ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లు కూడా నిర్వ‌హించాల‌ని ఇండియా కూట‌మిలోని పార్టీలు నిర్ణ‌యించాయి. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు పాస్ కాకుండా అడ్డుకున్న నేప‌థ్యంలో ఈ అంశంలో ప్ర‌జ‌ల్లోకి త‌ప్పుడు సంకేతాలు వెళ్ల‌కుండా విప‌క్షాలు జాగ్ర‌త్త‌ప‌డుతున్నాయి. ఇందులో భాగంగానే తాము మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని.. అయితే, ఈ బిల్లు ముసుగులో ప్ర‌భుత్వం దేశ రాజ‌కీయ ముఖ‌చిత్రాన్నే మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

Also Read..

పార్ల‌మెంట్ ప్ర‌త్యేక‌ స‌మావేశాలు.. ఉభ‌య‌స‌భ‌లు నిర‌వ‌ధిక వాయిదా

నిన్న‌టి ఓటింగ్‌ను మ‌హిళ‌ల ఓట‌మిగానే భావిస్తం: బీజేపీ చీఫ్ రాంచంద‌ర్‌రావు

డీలిమిటేష‌న్‌పై ప్ర‌త్యామ్నాయ సూచ‌న‌లు భేష్‌.. సీఎం రేవంత్‌ను అభినంధించిన‌ ప్రియాంక

Advertisement
Advertisement