త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Parliament Session | పార్ల‌మెంట్ ప్ర‌త్యేక‌ స‌మావేశాలు.. ఉభ‌య‌స‌భ‌లు నిర‌వ‌ధిక వాయిదా

Parliament Session | పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాలు (Parliament Session) ముగిశాయి. ఇవాళ ఉభ‌య‌స‌భ‌లు నిర‌వ‌ధిక వాయిదా ప‌డ్డాయి. చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు ఉద్దేశించిక బిల్లు, డీలిమిటేష‌న్ బిల్లు కోసం ఈనెల 16వ తేదీ నుంచి పార్ల‌మెంట్ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే.

D

National | Published On Apr 18, 2026, 12.02 pm IST

Parliament Session | పార్ల‌మెంట్ ప్ర‌త్యేక‌ స‌మావేశాలు.. ఉభ‌య‌స‌భ‌లు నిర‌వ‌ధిక వాయిదా
Advertisement

Parliament Session | పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాలు (Parliament Session) ముగిశాయి. ఇవాళ ఉభ‌య‌స‌భ‌లు నిర‌వ‌ధిక వాయిదా ప‌డ్డాయి. చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించేందుకు ఉద్దేశించిక బిల్లు, డీలిమిటేష‌న్ బిల్లు కోసం ఈనెల 16వ తేదీ నుంచి పార్ల‌మెంట్ ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. అయితే, ఇందులో అధికార బీజేపీకి చుక్కెదురైంది. మహిళా రిజర్వేషన్ల (Women's Reservation) అమలును వేగవంతం చేయడంతో పాటు, కొత్త జనాభా లెక్కల అవసరం లేకుండానే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) చేపట్టేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కీలక బిల్లు వీగిపోయింది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో ఎన్డీయే (NDA) కూటమికి అవసరమైన మూడింట రెండొంతుల (2/3rd) మెజారిటీ రాకపోవడంతో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ముందుకు సాగలేదు.

బిల్లు ఆమోదం పొందాలంటే మొత్తం 326 ఓట్లు అవసరం. అయితే ఓటింగ్‌లో మొత్తం 528 మంది ఎంపీలు పాల్గొనగా, బిల్లుకు అనుకూలంగా కేవలం 298 ఓట్లు మాత్రమే వచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. అవసరమైన సంఖ్యాబలం రాకపోవడంతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ బిల్లును లోక్‌సభ నుంచి ఉపసంహరించుకున్నారు. అనంతరం సభను రేపు (శనివారం) ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. ఈ నేప‌థ్యంలోనే నేడు లోక్‌స‌భ (Lok sabha), రాజ్య‌స‌భ (Rajya sabha) నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ్డాయి.

Also Read..

మెటాలో 8 వేల మందికి లేఆఫ్స్‌..!

ఇట‌లీ ప్ర‌ధాని మెలోనీని హ‌గ్ చేసుకుని ముద్దు పెట్టుకున్న ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మాక్రాన్‌

డీలిమిటేష‌న్‌పై ప్ర‌త్యామ్నాయ సూచ‌న‌లు భేష్‌.. సీఎం రేవంత్‌ను అభినంధించిన‌ ప్రియాంక

Advertisement
Advertisement