BJP chief Ramchandar Rao | నిన్నటి ఓటింగ్‌ను మహిళల ఓటమిగానే భావిస్తం: బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
BJP chief Ramchandar Rao | చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల (Womens reservations) కోసం నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు (Bill) వీగిపోయింది. ప్రతిపక్షాలు ఏకమై ఓటింగ్‌ను వ్యతిరేకించడంతో ఎన్డీయే (NDA) వెనకడుగు వేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరిన బీజేపీ చీఫ్ రాంచందర్‌రావును హౌస్ అరెస్టు చేశారు.
త్రినేత్ర.న్యూస్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల (Womens reservations) కోసం నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు (Bill) వీగిపోయింది. ప్రతిపక్షాలు ఏకమై ఓటింగ్‌ను వ్యతిరేకించడంతో ఎన్డీయే (NDA) వెనకడుగు వేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర భాజపా నాయకత్వం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ముట్టడికి బయలు దేరిన బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు(BJP chief Ramchandar Rao)ను పోలీసులు గృహ నిర్బంధం (House arrest) చేశారు. దీంతో ఆయన ఇంటివద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గృహ నిర్బంధం..
హౌస్ అరెస్టు సందర్భంగా తన ఇంట్లోనే రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. 32 ఏళ్లుగా కాంగ్రెస్ మహిళలను మోసం చేస్తోందని విమర్శించారు. మహిళల రిజర్వేషన్ కు అనుకూలం అంటూనే నిన్న పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌ను ఎందుకు వ్యతిరేకించారని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందన్నారు. కాంగ్రెస్ బానిస మనస్తత్వంతో వ్యవహరించిందని మండిపడ్డారు.

బ్రిటిషర్ ఏవో హ్యూమ్ స్థాపించిన కాంగ్రెస్‌కు ఒక ఇటాలియన్ అధినేతగా ఉంటూ బానిసత్వంతోటి పని చేస్తున్న నాయకులను చూస్తున్నం. రేవంత్‌రెడ్డి ఫ్యూడల్ మనస్తత్వం. చట్టసభల్లోకి సామాన్య మహిళలు ఎవరూ రావొద్దనేది వారి ఆలోచన. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వంటి వారే నాయకులుగా ఉండాలనే ధోరణితోనే మహిళా బిల్లుకు అడ్డు పడ్డారు. గాంధీల కుంటుంబం తప్ప ఎవరూ ఉండొద్దని వారి ఆలోచన. 33 శాతం మహిళల రిజర్వేషన్లకు 2023లో మద్దతు తెలిపి మళ్లీ దానికి వ్యతిరేకంగా ఓటేశారంటే ఏమనుకోవాలి. కాంగ్రెస్ మహిళలకు వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. కుటుంబ ప్రాతినిథ్యం కోసం, మైనారిటీ ఓట్ల కోసం మాత్రమే కాంగ్రెస్ స్వార్థపూరితంగా వ్యవహరిస్తోంది.
నిన్నటి ఓటమిని మహిళల ఓటమిగా భావించాలే. రిజర్వేషన్లు రాబోతున్నాయని మహిళలు ఎంతో సంతోషపడ్డారు. 32 ఏండ్లుగా బిల్లును కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో రకంగా ఆపుతున్నారు. దక్షిణాది అంశాలన్ని కేవలం రెచ్చగొట్టడానికి తెచ్చినవే. కేవలం మహిళల రిజర్వేషన్‌ను వ్యతిరేకించడానికే హైబ్రిడ్ ఫార్ములా అని ముంగటేసుకున్నరు. కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించొద్దని మహిళలను కోరుతున్నా. అతివలకు రిజర్వేషన్ ఇవ్వాలని లేదు మీకు. దీనికి వ్యతిరేకంగానే మేం ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి వెళ్తుంటే మమ్మల్ని హౌస్ అరెస్టు చేశారు. రిజర్వేషన్లు, మా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. దీన్ని చీకటి దినంగా పరిగణిస్తున్నం అని రాంచందర్‌రావు అన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు





