Revanth Reddy | డీలిమిటేషన్‌పై ప్రత్యామ్నాయ సూచనలు భేష్.. సీఎం రేవంత్‌ను అభినంధించిన ప్రియాంక
Revanth Reddy | నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రతిపాదనలకు సంబంధించి బీజేపీ విధానంలో లోపాలను ప్రజల ముందుంచడంతో పాటు ప్రత్యామ్నాయ సూచనలు చేసి దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు కృషి చేసినందుకుగాను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని (Revanth Reddy) కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అభినందించారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రతిపాదనలకు సంబంధించి బీజేపీ విధానంలో లోపాలను ప్రజల ముందుంచడంతో పాటు ప్రత్యామ్నాయ సూచనలు చేసి దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు కృషి చేసినందుకుగాను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని (Revanth Reddy) కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అభినందించారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం కలిశారు.
ఈ సందర్భంగా దక్షిణ భారత దేశంతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలను బలహీనపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రజాస్వామ్య విరుద్ధ రాజ్యాంగ సవరణను అడ్డుకోవడం.. దేశ భవిష్యత్తును కాపాడేందుకు ప్రతిపక్ష శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడంలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు మద్దతుగా నిలిచినందుకు తెలంగాణ ప్రజల తరఫున ప్రియాంక గాంధీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఏకగ్రీవంగా ఆమోదం పొందిన మహిళా బిల్లుతో సంబంధం లేకుండా, మహిళా సాధికారత పేరుతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, అనవసరమైన డీలిమిటేషన్ అజెండాను ముందుకు తీసుకువచ్చారని ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ సీఎంతో అన్నారు.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం





