త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Mandir Donations Row | రామ్‌ల‌ల్లా ఊయ‌ల కోసం 150 కిలోల వెండి వ‌స్తే.. 85 కిలోల‌తోనే దాన్ని త‌యారు చేశారు

Ram Mandir Donations Row | అయోధ్య‌లోని రామ మందిరంలో భ‌క్తులు స‌మ‌ర్పించిన విరాళాల చోరీ (Ram Mandir Donations Row) అంశంపై సిట్ ద‌ర్యాప్తులో సంచ‌ల‌నాత్మ‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. రూ.800 కోట్ల అంచ‌నాతో నిర్మించాల్సిన రామ‌మందిరం కోసం రూ.2,200 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు వెల్ల‌డైంది. చంప‌త్ రాయ్ ఎలాంటి ర‌శీదులు లేకుండా త‌న నివాసంలో విరాళాలు సేక‌రించిన‌ట్లు రామ మందిరం అకౌంట్స్ ఇన్‌ఛార్జ్ మ‌హిపాల్ సింగ్‌ (Mahipal Singh) ఆరోపించారు. ట్ర‌స్ట్ నిధుల‌తోనే విశ్వ‌హిందూ ప‌రిష‌త్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు.

D

National | Published On Aug 3, 2026, 1.10 pm IST

Ram Mandir Donations Row | రామ్‌ల‌ల్లా ఊయ‌ల కోసం 150 కిలోల వెండి వ‌స్తే.. 85 కిలోల‌తోనే దాన్ని త‌యారు చేశారు
Advertisement
  • ఎలాంటి ర‌శీదులు లేకుండా విరాళాల సేక‌ర‌ణ‌
  • వాస్తు శాస్త్ర విరుద్ధంగా ఆల‌యాన్ని నిర్మించారు
  • ట్ర‌స్ట్ నిధుల‌తోనే విశ్వ‌హిందూ ప‌రిష‌త్ కార్య‌క్ర‌మాలు
  • ట్ర‌స్ట్‌కు కోట్లాది రూపాయ‌ల న‌ష్టం
  • చంప‌త్ రాయ్‌పై సంచ‌లన ఆరోప‌ణ‌లు
  • సిట్ ద‌ర్యాప్తులో వెలుగులోకి సంచ‌ల‌న విష‌యాలు

Ram Mandir Donations Row | త్రినేత్ర‌.న్యూస్ : అయోధ్య‌లోని రామ మందిరంలో భ‌క్తులు స‌మ‌ర్పించిన విరాళాల చోరీ (Ram Mandir Donations Row) అంశం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఈ అంశం పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల‌ను కూడా కుదిపేస్తోంది. ఈ అంశంపై చ‌ర్చించాలంటూ ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నాయి. అదే స‌మ‌యంలో విరాళాల చోరీ అంశంపై సిట్ ద‌ర్యాప్తు సాగుతోంది. ఈ ద‌ర్యాప్తులో సంచ‌ల‌నాత్మ‌క విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

జులై 27న రామ మందిరం అకౌంట్స్ ఇన్‌ఛార్జ్ మ‌హిపాల్ సింగ్‌ (Mahipal Singh).. సిట్‌కు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు. రూ.800 కోట్ల అంచ‌నాతో నిర్మించాల్సిన రామ‌మందిరం కోసం రూ.2,200 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లు పేర్కొన్నారు. అది కూడా లోప‌భూయిష్టంగా నిర్మించార‌ని చెప్పారు. రామ మందిరం నిధుల‌తోనే విశ్వ‌హిందూ పరిష‌త్ భ‌వ‌నాన్ని కూడా నిర్మించిన‌ట్లు తెలిపారు. జ‌గ‌న్నాథ ఆల‌యం, ల‌వ‌కుశ ఆల‌యం, రంగ మ‌హ‌ల్‌లో రామ మందిరం కోసం ఉచితంగా ఆఫీసు స్థ‌లం అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ చంప‌త్ రాయ్ ల‌క్ష‌లాది రూపాయలు ఖ‌ర్చు చేసిన‌ట్లు అందులో ఆరోపించారు.

ర‌శీదులు లేకుండానే విరాళాల సేక‌ర‌ణ‌

ఆల‌య ట్ర‌స్ట్ జనరల్ సెక్రటరీ చంప‌త్ రాయ్ ఎలాంటి ర‌శీదులు లేకుండానే త‌న నివాసంలో విరాళాల సేక‌ర‌ణ చేప‌ట్టారు. ఆ మొత్తాన్ని స్వాహా చేసినా ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు. రామ మందిరం ట్ర‌స్ట్ నిధుల‌తోనే విశ్వ‌హిందూ ప‌రిష‌త్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. వీహెచ్‌పీకి చెందిన వ్య‌క్తుల‌కు రామ మందిర నిధుల‌తోనే గౌర‌వ వేత‌నాలు చెల్లించారు. ఉచితంగా ల‌భించే రాళ్ల‌ను ఉప‌యోగించ‌కుండా.. అత్య‌ధిక ధ‌ర‌ల‌కు నాణ్య‌త లేని రాళ్ల‌ను కొనుగోలు చేశారు.

85 కిలోల‌ల‌తోనే ఊయ‌ల‌..

రామ్‌ల‌ల్లా ఊయ‌ల కోసం 150 కిలోల వెండి రాగా.. కేవ‌లం 85 కిలోల‌ల‌తోనే దాన్ని త‌యారు చేయించారు. చంప‌త్ రాయ్ ప‌లు వివాదాస్ప‌ద ఆస్తుల‌ను కొనుగోలు చేశార‌ని.. అయితే అవి పొజిష‌న్ పొంద‌క‌పోవ‌డంతో ట్ర‌స్ట్‌కు కోట్లాది రూపాయ‌ల న‌ష్టం వాటిల్లిన‌ట్లు పేర్కొన్నారు.

వాస్తు శాస్త్ర విరుద్ధంగా

సాంప్రదాయ వాస్తు నియమాలకు వ్యతిరేకంగా రామమందిర నిర్మాణం చేపట్టారు. రామ మందిరం కోసం విరాళంగా వ‌చ్చిన కిరీటం మాయ‌మైంది. ఆ కిరీటాన్ని మాయం చేసిన వారిని చంప‌త్ రాయ్ క్ష‌మించారు. ఎలాంటి పోలీసు చ‌ర్య‌లూ తీసుకోలేద‌ని మ‌హిపాల్ సింగ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ స‌మాచారం వంద శాతం నిజం అని సిట్‌కు పంపిన స‌మాచారంలో ఆయ‌న పేర్కొన‌డం గ‌మ‌నార్హం. దీంతో నృపేంద్ర మిశ్రా నేతృత్వంలోని రామమందిర నిర్మాణ కమిటీపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇక‌ ఈ కేసులో ఇప్ప‌టికే ప‌లువురిని పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆలయ ట్రస్ట్ (Shri Ram Janmabhoomi Teerth Kshetra) జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ (Champat Rai) నైతిక బాధ్యత వహిస్తూ ఇప్పటికే రాజీనామా చేశారు. ఈ స్కామ్ వ్యవహారం ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దృష్టికి వెళ్లడంతో.. ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు టెంపుల్ కన్‌స్ట్రక్షన్ కమిటీ హెడ్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు.

Also Read..

అటు జెన్ జీ.. ఇటు అయోధ్య.. బీజేపీ సర్కార్‌ ఉక్కిరిబిక్కిరి

రెజ్ల‌ర్ల‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు.. బ్రిజ్ భూష‌ణ్‌కు ఢిల్లీ హైకోర్టు భారీ ఊర‌ట‌

నాని నిర్మాత‌...నితిన్ హీరో - అలియాస్ రుక్మిణి టైటిల్ గ్లింప్స్ రిలీజ్‌

Advertisement
Advertisement