Nani – Nithiin | నాని నిర్మాత…నితిన్ హీరో – అలియాస్ రుక్మిణి టైటిల్ గ్లింప్స్ రిలీజ్
నితిన్ హీరోగా నాచురల్ స్టార్ నాని నిర్మాణంలో ఓ సినిమా రాబోతుంది. ఈ మూవీ టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ సినిమాకు అలియాస్ రుక్మిణి అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాకు దండోరా ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Entertainment | Published On Aug 3, 2026, 12.59 pm IST
Nani - Nithiin | హీరో నితిన్ సక్సెస్ అందుకొని ఆరేళ్లు దాటిపోయింది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత హీరోగా ఏడు సినిమాలు చేశాడు నితిన్. అవన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. హిట్టు కోసం నితిన్ కథల ఎంపికలో తన స్టైల్ మార్చేశాడు. మాస్ కథలను పక్కనపెట్టి ఓ క్లాస్ స్టోరీస్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు.
నాని నిర్మాత....
హీరో నాని బ్యానర్‌లో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను సోమవారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. అలియాస్ రుక్మిణి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఓ వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. హీరో నాని, డైరెక్టర్ మురళీ వాయిస్ ఓవర్‌తో ఈ గ్లింప్స్ ఆసక్తిని పంచింది. ఇందులో కృష్ణ అనే పాత్రలో నితిన్ కనిపించబోతున్నట్లు చూపించారు. గరం గోపాల్, ఆమెకు ఆమె అంటే ఇష్టం, వ్రతం వెంకన్న అనే రచనలను రుక్మిణి రాసినట్లుగా గ్లింప్స్‌లో కనిపించింది. రుక్మిణి ఎవరు అని నాని అనగా....నా భార్య అంటూ నితిన్ బదులివ్వడం ఆసక్తిని పంచుతోంది.
దండోరా ఫేమ్...
అలియాస్ రుక్మిణి సినిమాకు దండోరా ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. నాని ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు ఆయన సోదరి దీప్తి ఘంటా నిర్మిస్తున్నారు. సోమవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లు సమాచారం.
బాలీవుడ్ బ్యూటీ...
అలియాస్ రుక్మిణి సినిమాలో నితిన్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆఫియా సయీద్ హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ సాజిద్ నదియావాలా బంధువైన ఆఫియా ప్రస్తుతం ప్రేమలు హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది.
వైష్ణవి చైతన్య...
ప్రస్తుతం అలియాస్ రుక్మిణితో పాటు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నితిన్ ఓ సినిమా చేస్తోన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో తొలుత రితికా నాయక్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ డేట్స్ ఇష్యూ కారణంగా రితికా నాయక్ తప్పుకోవడంతో ఆమె స్థానాన్ని వైష్ణవి చైతన్యతో రీప్లేస్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sara Arjun | మౌనరాగం సీరియల్ డైరెక్టర్‌తో ధురంధర్ హీరోయిన్ తెలుగు మూవీ
ఆగస్టు 27, 2026

Naga Durga | రాజు వెడ్స్ రాంబాయి హీరోతో నాగదుర్గ రొమాన్స్ – తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో శనార్తి
ఆగస్టు 14, 2026

Hero Nani | అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ – ఇప్పుడు ప్రొడ్యూసర్ – నాని, నితిన్ అలియాస్ రుక్మిణి మూవీ ఓపెనింగ్ ఫొటోలు!
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..



