Brij Bhushan Sharan Singh | రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీ హైకోర్టు భారీ ఊరట
Brij Bhushan Sharan Singh | మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు (Wrestlers Sexual Harassment Case)లో బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు (Brij Bhushan Sharan Singh) భారీ ఊరట లభించింది.
Brij Bhushan Sharan Singh | త్రినేత్ర.న్యూస్ : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు (Wrestlers Sexual Harassment Case)లో బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు (Brij Bhushan Sharan Singh) భారీ ఊరట లభించింది. ఈ కేసులో బ్రిజ్ భూషణ్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు (Delhi court) నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న వినోద్ తోమర్‌ను కూడా కోర్టు నిర్దోషిగా తేల్చింది.
కాగా, మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు బ్రిజ్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 2023 ఏప్రిల్‌లో బ్రిజ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. వినేష్ ఫొగాట్ సహా మొత్తం ఆరుగురు మహిళా రెజ్లర్లు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు జోక్యంతో ఆ రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బ్రిజ్ భూషణ్ సింగ్, వినోద్ తోమర్‌లపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్ (Brij Bhushan)పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినేష్ ఫొగాట్, భజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితర టాప్ రెజ్లర్లు (Wrestlers) ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొన్ని నెలలపాటూ ఆందోళనలు సైతం కొనసాగించిన విషయం తెలిసిందే.
మే-జూన్ మధ్య బ్రిజ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో.. ఢిల్లీ పోలీసులు 2023 జూన్ 15న 1500 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. 2024 మేలో ట్రయల్ కోర్టులో అభియోగాలు దాఖలు చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక గతేడాది మేలో ఓ మైనర్ తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో పోక్సో కేసులో బ్రిజ్ నిర్దోషిగా తేలారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు ముగిసినట్లైంది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను బ్రిజ్ ముందు నుంచి ఖండిస్తూ వస్తున్నారు. ఇక లైంగిక ఆరోపణల నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయనికి బీజేపీ టికెట్ కూడా ఇవ్వలేదు. తాజా కోర్టు తీర్పుపై బ్రిజ్ సంతోషం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు వచ్చిన రోజే.. ఆరోపణలు రుజువైతే ఉరివేసుకుంటానని చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు తనని కోర్టు నిర్దోషిగా ప్రకటించిందని చెప్పారు.
Also Read..
క్యాబ్ డ్రైవర్‌పై విచక్షణారహి దాడి.. నలుగురు యువకులు అరెస్ట్
పశ్చిమ ఆసియాలో శాంతి చర్చల ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు..
మళ్లీ శాంతి చర్చల దిశగా అమెరికా-ఇరాన్.. స్టాక్ మార్కెట్లలో జోష్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..






