Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
Kavitha | రాష్ట్రంలో రాజకీయం అంటే బూతులు తిట్టుకోవడమేనా? అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ.. ప్రజా సమస్యలపై పోరాటానికి తమ సేన సిద్ధమైందని చెప్పారు. స
Kavitha | రాష్ట్రంలో రాజకీయం అంటే బూతులు తిట్టుకోవడమేనా? అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ.. ప్రజా సమస్యలపై పోరాటానికి తమ సేన సిద్ధమైందని చెప్పారు. సమాజంలో అధర్మం పెరిగినప్పుడు, ప్రజలు పాలకుల తీరుతో ఇబ్బందులు పడుతున్నప్పుడు శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించి ధర్మపోరాటానికి పిలుపునిస్తాడని కవిత అన్నారు. ప్రస్తుతం తెలంగాణలోనూ అలాంటి పరిస్థితులే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతోందని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
రైతులకు నీళ్లిచ్చే ఆలోచనే లేదు
రైతుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కవిత నిలదీశారు. నీళ్లు, యూరియా, ధాన్యం కోసం రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పాలమూరు రైతులు జూరాల హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటి కోసం ఆందోళన చేయాల్సి వచ్చిందని చెప్పారు. వరి, మొక్కజొన్న రైతులు తమ పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తెలంగాణలో మళ్లీ రైతుల ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామని కవిత హామీ ఇచ్చారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చినా వెనుకాడబోమని చెప్పారు. పాలమూరు ప్రాంతంలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన నాయకత్వం అవసరమని.. యువత రాజకీయాల్లోకి వచ్చి బలమైన నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
నేను ఎవరి బాణాన్ని కాదు
తనపై బీఆర్‌ఎస్, సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపైనా కవిత స్పందించారు. తాను కాంగ్రెస్ విడిచిన బాణమని బీఆర్‌ఎస్ నేతలు, కల్వకుంట్ల కుటుంబం అవినీతి కారణంగా తాను బీఆర్‌ఎస్‌ను వీడిన బాణమని సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎవరి బాణాన్నీ కాదని.. తెలంగాణ బహుజనుల బాణమని కవిత స్పష్టం చేశారు. సభలో ప్రజా గాయకుడు గద్దర్ పాడిన ‘భలేగుందిరో మన అసెంబ్లీ’ పాటలోని చరణాలను ఆలపించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ప్రజలంతా తెలంగాణ రక్షణ సేనకు మద్దతుగా నిలిస్తే రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
సెప్టెంబర్ 20, 2026

Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
సెప్టెంబర్ 20, 2026

Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!
- ●Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్
- ●Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు - బెనిఫిట్ షోకు అనుమతి
- ●Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..

Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!

Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్



