Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
Maithili Thakur | బిహార్ ఎమ్మెల్యే, ప్రముఖ గాయని మైథిలీ ఠాకూర్ ఖరీదైన కారులో ముంబయి లాల్‌బాగ్చా రాజా దర్శనానికి రావడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆమె రోల్స్ రాయిస్ కారులో రావడంపై కొందరు నెటిజన్లు ట్రోల్ చేయగా.. బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆమెకు మద్దతుగా నిలిచారు.
Entertainment | Published On Sep 20, 2026, 8.56 pm IST
Maithili Thakur | బిహార్ ఎమ్మెల్యే, ప్రముఖ గాయని మైథిలీ ఠాకూర్ ఖరీదైన కారులో ముంబయి లాల్‌బాగ్చా రాజా దర్శనానికి రావడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆమె రోల్స్ రాయిస్ కారులో రావడంపై కొందరు నెటిజన్లు ట్రోల్ చేయగా.. బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆమెకు మద్దతుగా నిలిచారు. మైథిలీ ఠాకూర్ డ్రైవర్‌తో కలిసి నీలిరంగు రోల్స్ రాయిస్ కారులో లాల్‌బాగ్చా రాజా గణపతి మండపానికి వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోల్స్ రాయిస్ కలినన్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీల్లో ఒకటి. భారత్‌లో దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.10.50 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.
గొప్పగా బతకడం తప్పా?
మైథిలీపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో కంగనా స్పందించారు. ప్రజా సేవలో ఉన్నంత మాత్రాన నాయకులు సాధారణ జీవితం, వ్యక్తిగత విజయాలను వదులుకోవాలా? అంటూ ప్రశ్నించారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తూనే తమ వృత్తి, వ్యక్తిగత జీవితం, సంపాదనను కొనసాగించే హక్కు నేతలకు ఉందని పేర్కొన్నారు. ప్రజా ధనాన్ని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించకుండా.. మంచి జీవితం గడపడం తప్పేమీ కాదని కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు. ప్రజా సేవలో ఉన్నవారు ఎప్పుడూ పేదరికంలోనే జీవించాలనుకోవడం సరైన ఆలోచన కాదని ఆమె వ్యాఖ్యానించారు. మైథిలీ ఠాకూర్ మాత్రం తన ఖరీదైన కారుపై వస్తున్న విమర్శలపై ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. కంగనా ఇచ్చిన మద్దతుపైనా ఆమె ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.
కంగనా సినిమాల విషయానికొస్తే..
కంగనా చివరిగా ‘భారత్ భాగ్య విధాత’ సినిమాలో కనిపించారు. 2026 జూన్ 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. 2008లో ముంబైలోని కామా అండ్ ఆల్బ్లెస్ ఆసుపత్రి సిబ్బంది చూపిన ధైర్యం, తెగువ, సేవాభావం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం కంగనా ‘క్వీన్ 2’లో నటిస్తున్నారు. 2013లో వచ్చిన ‘క్వీన్’కు ఇది సీక్వెల్. అంతేకాకుండా ఆర్. మాధవన్‌తో కలిసి ఓ థ్రిల్లర్ చిత్రంలోనూ ఆమె నటించనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
సెప్టెంబర్ 20, 2026

Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ
సెప్టెంబర్ 20, 2026

Brahmotsavam 2026 | స్వర్ణరథంపై శ్రీవారి విహారం.. గోవింద నామస్మరణతో పులకించిన తిరుమల
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!
- ●Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్
- ●Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు - బెనిఫిట్ షోకు అనుమతి
- ●Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ
- ●Nani Interview | మా అమ్మకు యాక్షన్ సినిమాలు నచ్చవు - పుష్పతో కంపేరిజన్స్ - ప్యారడైజ్ సినిమాపై నాని కామెంట్స్

Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!

Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్

Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు - బెనిఫిట్ షోకు అనుమతి



