Parliament Monsoon Session | అటు జెన్ జీ.. ఇటు అయోధ్య.. బీజేపీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి
Parliament Monsoon Session | ఓవైపు జెన్ జీ ఉద్యమం.. మరోవైపు అయోధ్యలో విరాళాల చోరీ (Ayodhya Ram Mandir donations) అంశం కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
- వీధి నాటకంతో.. వివాదంలో ఎంపీ పప్పూ యాదవ్
- ఆయనపై స్పీకర్‌కు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన బీజేపీ ఎంపీ
Parliament Monsoon Session | త్రినేత్ర.న్యూస్ : ఓవైపు జెన్ జీ ఉద్యమం.. మరోవైపు అయోధ్యలో విరాళాల చోరీ (Ayodhya Ram Mandir donations) అంశం కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆయా అంశాలపై యువత, ప్రతిపక్ష పార్టీలు మోదీ ప్రభుత్వంపై గళమెత్తుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Session) మరో పది రోజులు మాత్రమే ఉండటంతో.. ఈ రెండు అంశాలపై సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే పార్లమెంట్ లోపలా, బయట ఆయా అంశాలపై ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో బీజేపీ ఎంపీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.
మరోవైపు అయోధ్య విరాళాల చోరీపై ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శించిన ఓ చిన్న స్కిట్ వివాదాస్పదమైంది. స్వతంత్య్ర ఎంపీ పప్పు యాదవ్ (Pappu Yadav) సన్యాసి వేశం ధరించి అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన కానుకలు ఏ విధంగా చోరీకి గురయ్యాయో వివరిస్తూ వీధి నాటకం ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీనిపై అధికార కూటమి ఎంపీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆయన సనాతన ధర్మాన్ని అవమానించారంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు.
పప్పూ యాదవ్ హిందూ సాధువు వేషధారణలో కనిపించి మతపరమైన మనోభావాలను కించపరచడంతోపాటూ సభ గౌరవాన్ని దిగజార్చేలా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎంపీ సంజయ్ జైస్వాల్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును అందజేశారు. రూల్ 222, రూల్ 223 ప్రకారం ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.
మరోవైపు స్కిట్ తర్వాత పప్పూ యాదవ్‌పై వారణాసిలో ఎఫ్ఐఆర్ కూడా నమోదైన విషయం తెలిసిందే. పలువురు సాధువులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలో పప్పూ యాదవ్ నిన్న ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఎంపీపై దాడికి ప్రయత్నించాడు. ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో సుమిత్ అనే వ్యక్తి ఒక్కసారిగా లేచి, రాముడిని అవమానించారంటూ ఎంపీపైకి చెప్పు విసిరాడు. ఆ తర్వాత కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా, అప్రమత్తమైన ఎంపీ అనుచరులు అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.
Also Read..
కూచిపూడి నృత్య కళాకారిణి విభా యడవల్లి అరంగేట్రం
టామ్ హాలండ్ స్పైడర్‌మ్యాన్ సంచలనం.. 4 రోజుల్లోనే ది ఒడిస్సీ రికార్డుకు చెక్..
రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీ హైకోర్టు భారీ ఊరట
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..






