Delhi SIR | ఎస్‌ఐఆర్‌లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!
Delhi SIR | ఢిల్లీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓటరు జాబితాలో వివరాల్లో తేడాల కారణంగా ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన 33.13 లక్షల మంది జాబితాలో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కుటుంబ సభ్యులు సైతం ఈ జాబితాలో ఉన్నారు.
Delhi SIR | ఢిల్లీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓటరు జాబితాలో వివరాల్లో తేడాల కారణంగా ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన 33.13 లక్షల మంది జాబితాలో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కుటుంబ సభ్యులు సైతం ఈ జాబితాలో ఉన్నారు. 98 ఏళ్ల ఎల్‌కే అద్వానీతో పాటు ఆయన కుమార్తె ప్రతిభ, కోడలు గీతికకు ఈసీ నోటీసులు జారీ చేసింది. 2002 ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితాతో ప్రస్తుత వివరాలు సరిపోలకపోవడంతో వీరికి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అద్వానీ కుమారుడు జయంత్ వివరాల మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. వీరంతా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్నారు.
సిసోడియా కుటుంబానికీ నోటీసులు
మనీష్ సిసోడియా, ఆయన భార్య సీమా, కుమారుడు మిర్ పేర్లు కూడా నోటీసుల జాబితాలో ఉన్నాయి. మిర్ విషయంలో తల్లిదండ్రుల పేర్లలో తేడాలు, సీమా విషయంలో ఆమె పేరులోనే వ్యత్యాసం ఉన్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. పత్రాల పరిశీలన అనంతరం సీఎం రేఖా గుప్తా వివరాలను అధికారులు ధ్రువీకరించారు. శాలిమార్ బాగ్ నియోజకవర్గ తుది ఓటర్ల జాబితాలో ఆమె పేరు చేర్చేందుకు రిజర్వ్ చేసినట్లు తెలిపారు.
33.13 లక్షల మందికి నోటీసులు
జూన్ 30 నుంచి ఆగస్టు 17 వరకు ఇంటింటి ఓటరు ధ్రువీకరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు కౌంటింగ్ ఫారం సమర్పించాల్సి వచ్చింది. ఢిల్లీలోని డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాల్లో దాదాపు 97 లక్షల మంది ఉండగా.. వివరాల్లో వ్యత్యాసాల కారణంగా 33.13 లక్షల మందిని నోటీసుల కోసం గుర్తించారు. వీరిలో ఇప్పటివరకు 31.63 లక్షలకు పైగా నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నోటీసులు అందుకున్న వారి పేర్లు వాస్తవాలు, పత్రాల ధ్రువీకరణ అనంతరమే తుది ఓటర్ల జాబితాలో ఉంటాయని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్పష్టం చేసింది. సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు (ఈఆర్‌ఓలు) అక్టోబర్ 29లోగా సమాధానాలు, అవసరమైన పత్రాలు సమర్పించాలి. క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియ సెప్టెంబర్ 30తో ముగియనుంది. తుది ఓటర్ల జాబితా నవంబర్ 4న ప్రచురించనున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్
- ●Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు - బెనిఫిట్ షోకు అనుమతి
- ●Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ
- ●Nani Interview | మా అమ్మకు యాక్షన్ సినిమాలు నచ్చవు - పుష్పతో కంపేరిజన్స్ - ప్యారడైజ్ సినిమాపై నాని కామెంట్స్
- ●Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ.. పనులు చేయడమే కష్టం
- ●India Spy Ajit Doval | అజిత్ దోవల్.. పాకిస్థాన్ లో మారువేషాల్లో తిరిగేవాడా?

Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్

Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు - బెనిఫిట్ షోకు అనుమతి

Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ

Nani Interview | మా అమ్మకు యాక్షన్ సినిమాలు నచ్చవు - పుష్పతో కంపేరిజన్స్ - ప్యారడైజ్ సినిమాపై నాని కామెంట్స్





