త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Temple Donations Case | రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు వేగవంతం చేయాలి

Ram Temple Donations Case | అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగంపై దర్యాప్తును వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తు పురోగతిపై రెండు వారాల్లో సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.

P

National | Published On Aug 17, 2026, 5.20 pm IST

Ram Temple Donations Case | రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు వేగవంతం చేయాలి
Advertisement
  • - రెండు వారాల్లో సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇవ్వాలి..
  • సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు

Ram Temple Donations Case | అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగంపై దర్యాప్తును వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తు పురోగతిపై రెండు వారాల్లో సీల్డ్‌ కవర్‌లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావులేకుండా సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని సిట్‌కు సూచించింది. పిటిషనర్లు చేసిన సూచనలను కూడా నిష్పక్షపాతంగా పరిశీలించాలని పేర్కొంది.

విరాళాల నిర్వహణపై దృష్టి

సిట్‌ నివేదికను పరిశీలించిన అనంతరం భక్తులు సమర్పించే విరాళాల నిర్వహణను మరింత పారదర్శకంగా, పద్ధతిగా మార్చేందుకు అవసరమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఆరోపణలపై దర్యాప్తుతోపాటు భవిష్యత్తులో విరాళాల నిర్వహణ వ్యవస్థలో సంస్కరణలపైనా కోర్టు దృష్టి సారించినట్లయింది. విరాళాల నిర్వహణలో పారదర్శకత కోసం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని విచారణ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.

సిట్‌లో ఫోరెన్సిక్‌ ఆడిటర్‌

రామ మందిర విరాళాల దుర్వినియోగంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసిన నాలుగు సభ్యుల సిట్‌ను గత నెల 27న సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఐజీ కిరణ్‌ ఎస్‌. నేతృత్వంలో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తు బృందంలో ఫోరెన్సిక్‌ ఆడిటర్‌ను కూడా చేర్చాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అంతకుముందు జూలై 20న ఈ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు చేసే అవకాశాలపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి కొనసాగింపుగా రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. జూలై 13న కూడా విరాళాల దుర్వినియోగంపై జరుగుతున్న దర్యాప్తు పురోగతిపై స్థితిగతుల నివేదిక సమర్పించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఆరోపణలపై నిష్పక్షపాతంగా, నిర్ణీత కాలవ్యవధిలో దర్యాప్తు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు నోటీసులు జారీ చేసింది.

సీబీఐ దర్యాప్తు కోరిన పిటిషనర్లు

రామ మందిర విరాళాల నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో పలువురు పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారిలో ఆర్జేడీ ఎంపీ సుధాకర్‌ సింగ్‌ కూడా ఉన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుతోపాటు ఆలయ ట్రస్టు ఆర్థిక లావాదేవీలకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని పిటిషనర్లు కోరారు. ప్రస్తుతం సిట్‌ దర్యాప్తు పురోగతిపై నివేదిక సమర్పించాల్సి ఉండగా.. దానిని పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement
Advertisement