Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
Ukraine Biggest Attack | రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఆదివారం రాత్రి ఏకంగా 1,600కుపైగా డ్రోన్లు మాస్కో వైపు దూసుకొచ్చినట్లు రష్యా అధికారులు తెలిపారు. వాటిలో భారీ సంఖ్యలో డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించారు. ఈ దాడిని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడిగా అభివర్ణించారు.
International | Published On Sep 20, 2026, 8.19 pm IST
Ukraine Biggest Attack | రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఆదివారం రాత్రి ఏకంగా 1,600కుపైగా డ్రోన్లు మాస్కో వైపు దూసుకొచ్చినట్లు రష్యా అధికారులు తెలిపారు. వాటిలో భారీ సంఖ్యలో డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించారు. ఈ దాడిని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడిగా అభివర్ణించారు. దాడిలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు సురక్షితంగా తరలించారు. మాస్కోలోని ఓ చమురు శుద్ధి కేంద్రంతో పాటు ఓ నివాస భవనం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. డ్రోన్ల దాడితో నగరంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, చమురు శుద్ధి కేంద్రం నుంచి పొగలు ఎగసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు.
21 అంతస్తుల భవనం నుంచి 400 మంది తరలింపు
మాస్కో ప్రాంతంలోని రమెన్‌స్కోయే జిల్లాలో ఓ 21 అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనం నుంచి సుమారు 400 మందిని సురక్షితంగా ఖాళీ చేయించారు. వారిలో 70 మంది చిన్నారులు ఉన్నట్లు ప్రాంతీయ గవర్నర్ ఆండ్రీ వోరోబ్యోవ్ తెలిపారు. మరికొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నట్లు చెప్పారు. రష్యా పార్లమెంట్ ఎన్నికల చివరి రోజున ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధానిని లక్ష్యంగా చేసుకున్న 450 డ్రోన్లను మార్గమధ్యంలోనే కూల్చివేసినట్లు మేయర్ సోబ్యానిన్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే దాడి ఉద్దేశమని ఆయన ఆరోపించారు. అయితే ఉక్రెయిన్ ఈ దాడిపై ఇప్పటివరకు స్పందించలేదు. దేశవ్యాప్తంగా ఉక్రెయిన్‌కు చెందిన 1,100 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఆక్రమిత క్రిమియా, నల్ల సముద్రం ప్రాంతాల మీదుగా వచ్చిన డ్రోన్లు కూడా ఇందులో ఉన్నాయని తెలిపింది.
రిఫైనరీలే లక్ష్యంగా..
రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఇరు దేశాలు పరస్పరం ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. మాస్కోలోని చమురు శుద్ధి కేంద్రంపై గతంలోనూ దాడులు జరిగాయి. 2024లో ఈ రిఫైనరీ 1.16 కోట్ల టన్నుల ముడి చమురును శుద్ధి చేసింది. ఇందులో 29 లక్షల టన్నుల పెట్రోల్, 32 లక్షల టన్నుల డీజిల్ ఉత్పత్తి జరిగింది. ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాలోని చమురు శుద్ధి సామర్థ్యంపై ప్రభావం పడటంతో కొన్ని ప్రాంతాల్లో పెట్రోలియం ఉత్పత్తుల కొరత, ఇంధన ధరల పెరుగుదల, పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కనిపిస్తున్నట్లు సమాచారం. ఇరు దేశాలు మాత్రం తాము పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదని చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇంధన కేంద్రాలపై పరస్పర దాడులను నిలిపివేయడానికి రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించిన నేపథ్యంలో ఈ తాజా దాడి చోటుచేసుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!
- ●Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్
- ●Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు - బెనిఫిట్ షోకు అనుమతి
- ●Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ
- ●Nani Interview | మా అమ్మకు యాక్షన్ సినిమాలు నచ్చవు - పుష్పతో కంపేరిజన్స్ - ప్యారడైజ్ సినిమాపై నాని కామెంట్స్
- ●Vakiti Srihari | ప్రాజెక్టులపై విమర్శలు చేయడం ఈజీ.. పనులు చేయడమే కష్టం

Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

Mysaa Teaser | ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు - రష్మిక మందన్న మైసా టీజర్ రిలీజ్

Nani Paradise | తెలంగాణలో నాని ప్యారడైజ్ టికెట్ ధరల పెంపు - బెనిఫిట్ షోకు అనుమతి

Brahmotsavams 2026 | బంగారు రథంపై భువనైకనాథుడు.. గోవింద నామంతో మార్మోగిన తిరుమాడ వీధులు.. ఫొటో గ్యాలరీ





