Jitendra Mishra | అయోధ్య ట్రస్ట్ సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
Jitendra Mishra | అయోధ్య రామాలయ ట్రస్ట్ తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా (Jitendra Mishra) ఎన్నికయ్యారు. సీఈవో పదవి కోసం దేశవ్యాప్తంగా దాదాపు 5,585 మంది అభ్యర్థులు దరఖాస్తులు రాగా.. జితేంద్ర మిశ్రాను సీఈవో పోస్టు వరించింది.
Jitendra Mishra | త్రినేత్ర.న్యూస్ : అయోధ్య రామాలయంలో (Ayodhya Ram Temple) భక్తులు సమర్పించిన విరాళాలు దుర్వినియోగం ఆరోపణల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అయోధ్య రామాలయ ట్రస్ట్ తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా (Jitendra Mishra) ఎన్నికయ్యారు. ఇవాళ జరిగిన కీలక సమావేశంలో ఆయన్ని సీఈవోగా ఎంపిక చేస్తూ శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.
రామమందిరం (Ayodhya Ram Temple) నిర్వహణ, పరిపాలన కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (Chief Executive Officer) కోసం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక సీఈవో పదవి కోసం దేశవ్యాప్తంగా దాదాపు 5,585 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెలెక్షన్ ప్రక్రియలో భాగంగా ట్రస్ట్ ఏర్పాటు చేసిన కమిటీ దరఖాస్తులను పరిశీలించి ముగ్గురి పేర్లను షార్ట్‌లిస్టు చేసింది. అందులో జితేంద్ర మిశ్రాను సీఈవోగా ఎంపిక చేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. ఆయన మూడేళ్లపాటూ ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ పదవీ కాలంలో ఆయన అయోధ్యలోనే నివాసం ఉండాల్సి ఉంటుంది. రామాలయ రోజువారీ పరిపాలన, ట్రస్ట్ నిర్ణయాల అమలు, సిబ్బంది పర్యవేక్షణ, ఆలయ సముదాయం సజావుగా పనిచేసేలా చూడటం సీఈవో బాధ్యత.
జితేంద్ర మిశ్రాకు భారత వైమానిక దళం (IAF)లో 39 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన డిసెంబర్ 1986లో ఫైటర్ పైలట్‌గా IAFలో చేరారు. అనేక విభాగాల్లో విశేష సేవలందించారు. ఆయనకు ఫైటర్ జెట్లు, రవాణా విమానాలు, హెలికాప్టర్లు ఇలా 18కి పైగా రకాల విమానాలను 3,000 గంటలకు పైగా నడిపిన అనుభవం ఉంది. ఇక గతేడాది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా దాయాది పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో ఆయన కీలక పాత్ర పోషించారు. వెస్ట్రన్ కమాండ్‌కు చీఫ్‌గా వ్యవహరించారు. అంతేకాదు, ఆపరేషన్ టైగర్ హిల్, సఫేద్ సాగర్ లలో కూడా కీలక పాత్ర పోషించారు. ఎయిర్ మార్షల్ హోదాలో పనిచేసిన జితేంద్ర మిశ్రా.. 2026 ఏప్రిల్ 30న వైమానిక దళం నుండి పదవీ విరమణ పొందారు.
Also Read..
ప్రసూతి సెలవు కారణంగా మహిళ హోదా తగ్గించకూడదు.. ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు
పీఆర్ ద్వారా జీడీపీ గణాంకాలను అందంగా మార్చగలరేమో.. ఆర్థిక వ్యవస్థను కాదు : కాంగ్రెస్
జియోహాట్‌స్టార్ గ్లోబల్ ఎంట్రీ.. 3 దేశాల్లో సేవలు ప్రారంభం
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jio Hotstar | జియోహాట్‌స్టార్ గ్లోబల్ ఎంట్రీ.. 3 దేశాల్లో సేవలు ప్రారంభం
- ●డిఫెన్స్ నుంచి అటాక్‌లోకి సురేఖ.. రివర్స్ గేమ్‌తో హైకమాండ్‌కు బిగ్ సర్ప్రైజ్!
- ●Maternity leave | ప్రసూతి సెలవు కారణంగా మహిళ హోదా తగ్గించకూడదు.. ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు
- ●Anthropic | ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఫేబుల్ 5.1, మిథోస్ 5.1.. ప్రత్యేకతలివే..
- ●Disha Patani | ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. దిశా పటానీ పోస్ట్ వైరల్..
- ●Sudeep | ‘దేవరాయ’గా సుదీప్.. రాజసం ఉట్టిపడేలా లుక్

Jio Hotstar | జియోహాట్‌స్టార్ గ్లోబల్ ఎంట్రీ.. 3 దేశాల్లో సేవలు ప్రారంభం

డిఫెన్స్ నుంచి అటాక్‌లోకి సురేఖ.. రివర్స్ గేమ్‌తో హైకమాండ్‌కు బిగ్ సర్ప్రైజ్!

Maternity leave | ప్రసూతి సెలవు కారణంగా మహిళ హోదా తగ్గించకూడదు.. ఢిల్లీ హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు

Anthropic | ఆంథ్రోపిక్ నుంచి క్లాడ్ ఫేబుల్ 5.1, మిథోస్ 5.1.. ప్రత్యేకతలివే..






