త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Temple Donation Theft Case | విరాళాల చోరీ కేసులో చంప‌త్ రాయ్‌కి సిట్ క్లీన్ చిట్‌

Ram Temple Donation Theft Case | దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన అయోధ్య రామాల‌యం (Ayodhya Ram Temple)లో కానుక‌ల చోరీ కేసులో ఆల‌య ట్ర‌స్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంప‌త్ రాయ్ (Champat Rai)కి భారీ ఊర‌ట ల‌భించింది. ఈ కేసులో ఆయ‌న‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) క్లీన్ చిట్ (Clean Chit) ఇచ్చింది.

D

National | Published On Aug 18, 2026, 1.11 pm IST

Ram Temple Donation Theft Case | విరాళాల చోరీ కేసులో చంప‌త్ రాయ్‌కి సిట్ క్లీన్ చిట్‌
Advertisement

Ram Temple Donation Theft Case | త్రినేత్ర‌.న్యూస్ : దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన అయోధ్య రామాల‌యం (Ayodhya Ram Temple)లో కానుక‌ల చోరీ కేసుపై ద‌ర్యాప్తు వేగ‌వంతంగా సాగుతోంది. ఈ క్ర‌మంలో శ్రీరామ జన్మభూమి ట్రస్టు (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) మాజీ ప్రధాన కార్యదర్శి చంప‌త్ రాయ్ (Champat Rai)కి భారీ ఊర‌ట ల‌భించింది. ఈ కేసులో ఆయ‌న‌కు సిట్ (SIT) క్లీన్ చిట్ (Clean Chit) ఇచ్చింది. రాయ్‌తోపాటూ ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రా (Anil Mishra)కు కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్ చిట్ ఇచ్చిన‌ట్లు తెలిసింది.

కాగా, విరాళాల చోరీ ఆరోప‌ణ‌లు రావ‌డంతో జూన్ 27న చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత, ఆలయంలో విరాళాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి SIT వారిద్దరినీ విచారించింది. మ‌రోవైపు విరాళాల చోరీ కేసులో సిట్ స‌మ‌ర్పించిన తుది నివేదిక‌ను త‌దుప‌రి చ‌ర్య‌ల కోసం యూపీ హోం శాఖ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అంద‌జేసింది. చోరీకి గురైన నిధులు, బ్యాంక్ లావాదేవీలకు ట్రస్ట్ ఉన్నతాధికారులకు ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధం లేదని సిట్ అధికారులు తేల్చిన‌ట్లు స‌మాచారం.

Also Read..

ఉరిశిక్ష‌కు ప్ర‌త్యామ్నాయం కోరుతూ పిటిష‌న్‌.. సుప్రీంకోర్టు ఏమ‌న్న‌దంటే..?

ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై భార‌త్‌ను ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోవాలి : అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌

ఘోర ప్ర‌మాదం.. 8 మంది కూలీలు మృతి

Advertisement
Advertisement