Telegram | కేంద్రం నిర్ణయంపై హైకోర్టులో సవాల్ చేసిన టెలిగ్రామ్
Telegram | నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో (NEET Re Examination) తమ యాప్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) సవాల్ చేసింది.
Telegram | నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో (NEET Re Examination) తమ యాప్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ (Telegram) ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) సవాల్ చేసింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరింది. ఈ అంశం జస్టిస్ తేజస్ కరియా ముందు ప్రస్తావనకు రాగా.. టెలిగ్రామ్ అభ్యర్థనను ఆయన అంగీకరించారు. ఈ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం తర్వాత విచారించనున్నట్లు తెలిపారు.
టెలిగ్రామ్‌పై నిషేధం..
జూన్ 21వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్‌ను నిర్వహిస్తున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చేసిన సిఫార్సుల మేరకు దేశంలో టెలిగ్రామ్ యాప్‌పై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే. జూన్ 22 వరకు టెలిగ్రామ్‌పై నిషేధం విధించింది. పరీక్షా పత్రాల లీకేజీ ప్రయత్నాలను అడ్డుకోవడం, తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చేసిన సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
దీంతోపాటూ జూన్ 30వ తేదీ వరకు టెలిగ్రాం యాప్‌లో ఉన్న మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా ప్రభుత్వం డిజేబుల్ చేసింది. పాత సందేశాలను ఎడిట్ చేసే ఫీచర్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని టెలిగ్రామ్ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేసి చీటింగ్ ముఠాలు నకిలీ పేపర్ లీక్ ఆధారాలను సృష్టించారని ఎన్టీయే పేర్కొంది. ఛానల్ అడ్మినిస్ట్రేటర్లు పాత మెసేజ్‌లను ఎడిట్ చేసి, ఒరిజినల్ టైమ్‌స్టాంప్ మారకుండా పాత ఫైళ్ల స్థానంలో కొత్త పీడీఎఫ్‌లను అప్‌లోడ్ చేస్తున్నట్లు వివరించింది. ఈ ఆఫ్షన్‌ను దుర్వినియోగం చేసి చీటింగ్ ముఠాలు పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు నకిలీ ఆధారాలను సృష్టిస్తున్నారని ఎన్టీయే తెలిపింది. ఇక పేపర్ లీకేలకు చెందిన అనేక ఛానళ్లను, గ్రూపులను ఇప్పటికే ప్రభుత్వం తొలగించింది.
Also Read..
స్మోకింగ్ వదిలేసిన మెలోనీ, వాచ్ మర్చిపోయిన మాక్రాన్.. G7 సదస్సులో దేశాధినేతల సరదా సంభాషణ
ఉద్ధవ్ సేనలో 2022 నాటి సీన్ రిపీట్..?
ఆర్బీఐలో యంగ్ ప్రొఫెషనల్స్.. నెలకు రూ.1.5 లక్షల స్టైపెండ్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Balmoor Venkat | విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు.. మీ లడాయి ఎక్కడికి పోయింది?.. బీజేపీ నేతలపై బల్మూర్ వెంకట్ ఆగ్రహం
ఆగస్టు 24, 2026

Rahul Gandhi | తప్పులు ఎన్టీఏ చేస్తే.. శిక్ష మాత్రం విద్యార్థులు అనుభవిస్తున్నారు.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
ఆగస్టు 17, 2026

UGC NET | తప్పుల తడకగా ప్రశ్నపత్రాలు.. మూడు సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..
- ●Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం
- ●Rashmika Mandanna | రవితేజ ఇరుముడికి రష్మిక మందన్న ఎమోషనల్ రివ్యూ
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- ●Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి

Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం

Rashmika Mandanna | రవితేజ ఇరుముడికి రష్మిక మందన్న ఎమోషనల్ రివ్యూ

సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు



