G7 Hot Mic Moments | స్మోకింగ్ వదిలేసిన మెలోనీ, వాచ్ మర్చిపోయిన మాక్రాన్.. G7 సదస్సులో దేశాధినేతల సరదా సంభాషణ
G7 Hot Mic Moments | జీ7 (G7 Summit) సదస్సు సందర్భంగా దేశాధినేతల మధ్య జరిగిన సరదా సంభాషణలు మైక్రోఫోన్లలో రికార్డయ్యాయి (G7 Hot Mic Moments). అందులో తాను స్మోకింగ్ మానేశానంటూ ఇటలీ ప్రధాని మెలోనీ తెలిపారు. ఇక బర్త్‌డే బాయ్ ట్రంప్‌కు అరుదైన బహుమతి లభించింది.
International | Published On Jun 17, 2026, 12.26 pm IST
G7 Hot Mic Moments | జీ7 వంటి అంతర్జాతీయ సదస్సుల్లో (G7 Summit) దేశాధినేతలు ప్రపంచ శాంతి, భద్రత, సాంకేతిక అంశాలపై చర్చలు సర్వసాధారణం. కానీ, నేతల మధ్య జరిగే కొన్ని సరదా సంఘటనలు కూడా ఉంటాయి. అవి చాలా అరుదుగా బయటి ప్రపంచానికి తెలుస్తుంటాయి. తాజాగా ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న జీ 7 సదస్సులో నేతల మధ్య చోటు చేసుకున్న కొన్ని వ్యక్తిగత, సరదా సంభాషణలు మైక్రోఫోన్లలో రికార్డయ్యాయి (G7 Hot Mic Moments). అవి ఇప్పుడు నెటిజన్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా..?
స్మోకింగ్ మానేశా.. మెలోనీ
సమావేశం ప్రారంభానికి ముందు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Georgia Meloni), జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా తాను ఈ ఉదయం నిద్రమత్తు వదిలించుకోవడానికి మూడు కాఫీలు తాగాల్సి వచ్చిందని మెలోనీ సరదాగా వ్యాఖ్యానించారు. అప్పుడు జర్మన్ ఛాన్సలర్ ధూమపానం గురించి మెలోనీని పశ్నించారు. దీనికి స్పందించిన ఇటలీ ప్రధాని తాను స్మోకింగ్ మానేశానంటూ సమాధానమిచ్చారు. "నేను స్మోకింగ్ చేయడం లేదు.. మే 1వ తేదీ నుంచే మానేశా" అంటూ మెలోనీ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా అక్కడ స్మోకింగ్‌పై చర్చ మొదలైంది. మీరు ఎప్పుడు స్మోకింగ్ మానేశారు..? అంటూ యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాను యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ప్రశ్నించారు. దానికి ఆయన తాను ధూమపానం మానేసి 21 సంవత్సరాలు అవుతోందని తెలిపారు.
Italy's Meloni says she quit smoking at G7 Summit. pic.twitter.com/Z3NFztqS6m
— Clash Report (@clashreport) June 16, 2026
వాచ్ మర్చిపోయిన మాక్రాన్..
ఇక లంచ్‌కు ముందు దేశాధినేతల మధ్య ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. నేతలంతా లంచ్‌కు బయల్దేరగా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) తన వాచ్‌ను మీటింగ్ రూమ్‌లోనే వదిలేసి వెళ్లిపోయారు. ఆ వాచ్‌ను గమనించిన కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ "మాక్రాన్ తన వాచ్‌ను ఇక్కడే వదిలేశారు.. ఆ వాచ్ మాకు దొరికింది" అంటూ సదరాగా అన్నారు. దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. "ఆయన వెళ్ళిపోతే ఆ వాచ్ నాకు ఇచ్చేయ్" అని అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.
మెలోడీ.. మా జంట చాలా ఫేమస్
ఫ్రాన్స్ వేదికగా మరోసారి మెలోడీ మూమెంట్ ఆకర్షించింది. ఈ సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రధాని మోదీ అన్న మాటలు అత్యంత చర్చనీయాంశం అయ్యాయి. ఫ్యామిలీ ఫొటో సందర్భంగా మెలోనితో మాట్లాడుతూ "మీరు ఇన్‌స్టాగ్రామ్ చూశారా..?" అని మోదీ అడిగారు.. దీనికి ఆమె "మా జంట ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్" అని చెప్పారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వులు చిందించారు.
బర్త్‌డే బాయ్ ట్రంప్‌కు కానుక..
ఇక ఈ మీటింగ్‌లో అత్యంత ఆసక్తికర సంఘటన అందరినీ ఆకర్షించింది. అదే జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్-ట్రంప్ మధ్య సంభాషణ. ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్‌తో విభేదించిన మెర్జ్.. అధ్యక్షుడికి పుట్టినరోజు సందర్భంగా అరుదైన కానుక ఇవ్వడం ఆకట్టుకుంది. ట్రంప్ ఈ జూన్ 14న 80వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జర్మన్ నేషనల్ ఫుట్‌బాల్ జట్టు జెర్సీని ట్రంప్‌కు బహుమతిగా ఇచ్చారు. మరో విశేషం ఏంటంటే.. ట్రంప్ ప్రస్తుతం అమెరికాకు 47వ అధ్యక్షుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన పదవీకాలాన్ని సూచిస్తూ 47వ నంబర్‌తోపాటూ ట్రంప్ అనే పేరుతో ఉన్న జెర్సీని గిఫ్ట్‌గా ఇచ్చారు.
President Trump is gifted a custom German national team '47' jersey from German Chancellor Friedrich Merz at the G7 summit in France. pic.twitter.com/Mt0w80RypJ
— Breaking911 (@Breaking911) June 16, 2026
గ్రీన్‌లాండ్ ప్రస్తావన
ఇక మీటింగ్ రూమ్‌లో గ్రీన్‌లాండ్ ప్రస్తావన వచ్చింది. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాతో మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ "మీకు అర్థమైందా?" అని అనడం మైక్రోఫోన్‌లో రికార్డ్ అయింది. ఆ తర్వాత "గ్రీన్‌లాండ్" పదం పలికారు.
ప్రపంచ నేతలకు ప్రత్యేక బహుమతులు
ఈ సందర్భంగా ప్రపంచ నేతలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. వచ్చే ఏడాది ఫ్రెంచ్ ఆల్ప్స్ (French Alps) వేదికగా సైక్లింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ జరగనుంది. దాన్ని ప్రమోట్ చేసేందుకు మాక్రాన్ ఏడుగురు ప్రపంచ నాయకులకు వారి పేరుతో ప్రత్యేకంగా తయారు చేయించిన సైకిళ్లను బహుమతిగా ఇచ్చారు.
Also Read..
ఉద్ధవ్ సేనలో 2022 నాటి సీన్ రిపీట్..?
ఏకంగా ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లారు.. నగదు కాజేసీ, పెట్రోల్‌తో కాల్చేశారు..
ఆర్బీఐలో యంగ్ ప్రొఫెషనల్స్.. నెలకు రూ.1.5 లక్షల స్టైపెండ్
తాజావార్తలు
- ●Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..
- ●Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం
- ●Rashmika Mandanna | రవితేజ ఇరుముడికి రష్మిక మందన్న ఎమోషనల్ రివ్యూ
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- ●Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి

Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం

Rashmika Mandanna | రవితేజ ఇరుముడికి రష్మిక మందన్న ఎమోషనల్ రివ్యూ

సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు






