RBI | ఆర్బీఐలో యంగ్ ప్రొఫెషనల్స్.. నెలకు రూ.1.5 లక్షల స్టైపెండ్
RBI | మీరు పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారా?. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్, క్యాంటమ్ టెక్నాలజీ, ఎకనమిక్ రీసెర్చ్ వంటి విభాగాల్లో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) బంగారం లాంటి అవకాశం కల్పిస్తున్నది.
RBI | త్రినేత్ర.న్యూస్: మీరు పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారా?. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్, క్యాంటమ్ టెక్నాలజీ, ఎకనమిక్ రీసెర్చ్ వంటి విభాగాల్లో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా (RBI) బంగారం లాంటి అవకాశం కల్పిస్తున్నది. ముంబైని సెంట్రల్ ఆఫీస్ డిపార్ట్‌మెంట్లలో పనిచేసేందుకు అత్యంత ప్రతిభావంతులైన యువ నిపుణుల కోసం యంగ్ ప్రొఫెషనల్స్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (RBI Young Professionals (YP) Recruitment) చేపట్టించింది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.50 లక్షల స్టైపెండ్ అందించనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి.
మొత్తం ఖాళీలు: 12
ఎంపికైన అభ్యర్థులు ముంబైలోని ఆర్‌బీఐ సెంట్రల్ ఆఫీస్ విభాగాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, క్లైమేట్ రిస్క్ అండ్ సస్టైనబుల్ ఫైనాన్స్, పాలసీ రీసెర్చ్, పేమెంట్ సిస్టమ్స్ వంటి విభాగాలు అందులో ఉన్నాయి.
అర్హతలు
పోస్టును బట్టి అర్హతలు మారుతూ ఉంటాయి. సాధారణంగా సంబంధిత విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ సమాన అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 2026 జూలై 6 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,50,000 ఫిక్స్‌డ్ స్టైపెండ్ చెల్లించబడుతుంది. కాంట్రాక్టు 3 ఏండ్లు ఉంటుంది. పనితీరు ఆధారంగా గరిష్టంగా 5 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్- yphrmdco@rbi.org.in
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
తాజావార్తలు
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్మెంట్
- ●Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు
- ●Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..
- ●Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం
- ●Rashmika Mandanna | రవితేజ ఇరుముడికి రష్మిక మందన్న ఎమోషనల్ రివ్యూ
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్మెంట్

Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు

Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం






