త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Alpha Trailer | అదిరిన ‘ఆల్ఫా’ ట్రైలర్.. యాక్షన్ మోడ్‌లో అలియా

Alpha Trailer | బాలీవుడ్ బ్యూటీలు అలియా భట్, శర్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పై–యాక్షన్ చిత్రం ‘ఆల్ఫా’ ట్రైలర్‌ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. శివ్ రావైల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించగా.. హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

P

Entertainment | Published On Jun 17, 2026, 3.48 pm IST

Alpha Trailer | అదిరిన ‘ఆల్ఫా’ ట్రైలర్.. యాక్షన్ మోడ్‌లో అలియా
Advertisement

Alpha Trailer | బాలీవుడ్ బ్యూటీలు అలియా భట్, శర్వరి వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పై–యాక్షన్ చిత్రం ‘ఆల్ఫా’ ట్రైలర్‌ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. శివ్ రావైల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించగా.. హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అలియా భట్ ‘సీత’ పాత్రలో కనిపించనుండగా.. బాబీ డియోల్ ఆమెకు శిక్షణ ఇస్తున్నట్లుగా ట్రైలర్‌లో చూపించారు. అయితే, ఆ తర్వాత అతడే ఆమెకు శత్రువుగా మారడంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది.

బాబీ డియోల్‌ను అడ్డుకునే లక్ష్యంతో అలియా పోరాటం చేస్తుండగా.. ఆ ప్రయాణంలో శర్వరి వాఘ్ ఆమెతో చేతులు కలుపుతుంది. మరోవైపు బాబీ డియోల్ అమలు చేయబోయే ప్రమాదకర ప్రణాళికలను అడ్డుకునేందుకు అనిల్ కపూర్ రంగంలోకి దిగినట్లు ట్రైలర్‌లో చూపించారు. అలియా, శర్వరి కలిసి చేసే యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగ్ దృశ్యాలు, పోరాట ఘట్టాలు ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ట్రైలర్ చివర్లో హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రకు సంబంధించిన దృశ్యాన్ని చూపిస్తూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు. ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా.. అక్షయ్ విధాని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఆల్ఫా’ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement
Advertisement