NEET UG | నీట్ యూజీ అడ్మిట్ కార్డులు విడుదల..
NEET UG | త్రినేత్ర.న్యూస్: నీట్ యూజీ (NEET UG) రీ-ఎగ్జామ్ ఈ నెల 21న జరుగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను (Admit Cards) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in.లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేసి హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డులో ఉన్న వ్యక్తిగత వివరాలు, పరీక్షా కేంద్రం, రోల్ నంబర్, పరీక్ష సమయం వంటి అంశాలను అభ్యర్థులు జాగ్రత్తగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్‌లో పేరు, ఫోటో, రోల్ నంబర్, పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే ఎన్‌టీఏ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలన్నారు. దీంతోపాటు neetug2026@nta.ac.in ఈ-మెయిల్ ద్వారా కూడా సమస్యలను తెలియజేయవచ్చు.
నీట్ యూజీ 2026 రీ టెస్ట్ వచ్చే ఆదివారం (జూన్ 21) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్-పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. పరీక్షా రోజు అభ్యర్థులు అడ్మిట్ కార్డు ప్రింట్‌తోపాటు చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తమతో తీసుకెళ్లాలని వెల్లడించింది. నిషేధిత వస్తువులను పరీక్షా కేంద్రానికి తీసుకురాకూడదు. అభ్యర్థులు పరీక్షకు ముందు అధికారిక సూచనలను పూర్తిగా చదివి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

పెరిగిన సమయం..
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎన్‌టీఏ అదనపు సమయం ఇవ్వడంతోపాటు మరికొన్ని వెసులుబాట్లు కల్పించింది. బుక్‌లెట్‌లో రఫ్ వర్క్ చేసుకునేందుకు అదనంగా పేజీలను కేటాయించింది. గతంలో నీట్ పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు) ఉండేది. తాజాగా దానిని 195 నిమిషాలకు (3.15 గంటలకు) పెంచింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పరీక్ష సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. హాజరు పట్టికలో సంతకాలు తీసుకోవడం లాంటివాటితో విద్యార్థులు పరీక్ష సమయాన్ని కోల్పోకుండా ఉండేందుకే అదనంగా 15 నిమిషాల సమయం ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ సంవత్సరం నీట్ యూజీకి దాదాపు 22.75 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, మే 3న జరిగిన పరీక్షకు 22.05 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి






