త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telegram Ban India | దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేశారు : టెలిగ్రామ్ బ్యాన్‌పై రాహుల్, కేజ్రీవాల్ ఫైర్

నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ భయంతో టెలిగ్రామ్ యాప్‌ను బ్యాన్ చేయడంపై రాహుల్, కేజ్రీవాల్ మండిపడ్డారు. దొంగలను వదిలేసి విద్యార్థులకు నష్టం చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు.

J

National | Published On Jun 17, 2026, 4.05 pm IST

Telegram Ban India | దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేశారు : టెలిగ్రామ్ బ్యాన్‌పై రాహుల్, కేజ్రీవాల్ ఫైర్

సంక్షిప్త సారాంశం

జూన్ 21న జరగనున్న నీట్-యూజీ (NEET-UG) రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌ను జూన్ 22 వరకు కేంద్రం బ్లాక్ చేసింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దొంగను వదిలేసి బాధితుడి ఇంటికి తాళం వేసినట్లు ప్రభుత్వ తీరు ఉందని, ఇలా చేస్తే పేపర్ లీక్‌లు ఆగుతాయా అని వారు ప్రశ్నించారు. ఫేక్ పేపర్లు అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్నారనే ఉద్దేశంతోనే టెలిగ్రామ్‌ను రెస్ట్రిక్ట్ చేశామని ఎన్‌టీఏ (NTA) స్పష్టం చేసింది.

Advertisement

Telegram Ban India | త్రినేత్ర.న్యూస్ : నీట్-యూజీ (NEET-UG) రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ (Telegram) యాప్‌ను తాత్కాలికంగా బ్యాన్ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. జూన్ 21న రీ-ఎగ్జామ్ జరగనుండగా, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ యాప్‌ను బ్లాక్ చేశారు. అయితే, ఈ చర్యతో నిజంగానే పేపర్ లీక్‌లకు చెక్ పెట్టగలరా అంటూ విపక్ష నేతలు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

టెలిగ్రామ్‌ను బ్యాన్ చేసినట్లే రాబోయే రోజుల్లో వాట్సప్‌ను (WhatsApp) కూడా రెస్ట్రిక్ట్ చేస్తారా అంటూ రాహుల్ గాంధీ ఎక్స్ (X) వేదికగా ప్రశ్నించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలు చాలా "అబ్సర్డ్" (అర్థరహితం) గా ఉన్నాయని, పేపర్ లీక్‌లను ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేజ్రీవాల్ మండిపడ్డారు.

దొంగను పట్టుకోకుండా.. బాధితులపై ప్రతాపమా?

టెలిగ్రామ్ బ్యాన్‌పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. "దొంగను పట్టుకునే బదులు.. బాధితుడి ఇంటికే తాళం వేసినట్లుంది ఈ వ్యవహారం. ఎన్నో ఏళ్లుగా లక్షలాది మంది విద్యార్థులు నోట్స్, టెస్ట్ సిరీస్, డిస్కషన్స్, ప్రిపరేషన్ కోసం టెలిగ్రామ్‌ను వాడుతున్నారు. ఆ సదుపాయాన్ని లాగేసుకోవడం ద్వారా పేపర్ లీక్ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది?" అని ఆయన ప్రశ్నించారు.

మోదీ గారూ.. ఈ నాటకాలు ఆపండి, స్టూడెంట్స్‌పై కాదు మాఫియాపై స్ట్రైక్ చేయండి అంటూ రాహుల్ హితవు పలికారు.

కేజ్రీవాల్ సెటైర్లు.. ఎమ్మెల్యేల కొనుగోలుకు లింక్

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. "ఆర్మీ షిప్‌లలో పేపర్లను తరలించడం, టెలిగ్రామ్‌ను షట్‌డౌన్ చేయడం.. ఇలాంటి చర్యలు పేపర్ లీక్‌లను ఆపుతాయా? కచ్చితంగా ఆపలేవు. ఈ పేపర్ లీక్ బిజినెస్ అనేది మల్టీ-బిలియన్ రూపాయల రాకెట్. ఇందులో వచ్చే డబ్బు పైస్థాయి వరకు వెళుతుంది. ఒకవేళ పేపర్ లీక్‌లు ఆగిపోతే.. ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలే బీజేపీని వీడిన కే అన్నామలై సైతం ఎగ్జామ్ ముందు ఈ హై-సెక్యూరిటీ చర్యలను తప్పుబట్టారు. ఇప్పటికే ఎగ్జామ్ టెన్షన్‌తో ఉన్న విద్యార్థులపై ఈ చర్యలు మరింత ప్రెజర్ పెంచుతాయని ఆయన అన్నారు.

టెలిగ్రామ్‌ను ఎందుకు బ్యాన్ చేశారు?

నీట్ రీ-ఎగ్జామ్ తర్వాతి రోజైన జూన్ 22 వరకు ఇండియాలో టెలిగ్రామ్ యాక్సెస్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రెస్ట్రిక్ట్ చేసింది. ఈ నిర్ణయాన్ని ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ సమర్థించుకున్నారు.

"లీకైన ఎగ్జామ్ పేపర్లు మా దగ్గర ఉన్నాయంటూ కొందరు మోసగాళ్లు టెలిగ్రామ్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎగ్జామ్ సజావుగా జరిగేలా చూడటానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటాం" అని ఆయన పీటీఐ (PTI) వార్తా సంస్థకు తెలిపారు. ఫేక్ ప్రూఫ్ వీడియోలు, మానిప్యులేటెడ్ చాట్స్‌ను నమ్మి మోసపోవద్దని స్టూడెంట్స్, పేరెంట్స్‌ను ఎన్‌టీఏ హెచ్చరించింది.

మరోవైపు, ఈ టెంపరరీ బ్లాక్‌పై టెలిగ్రామ్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement