త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IMD | జూన్ 5 త‌ర్వాతే బ‌ల‌మైన రుతుప‌వ‌నాలు : ఐఎండీ

IMD | దేశ‌వ్యాప్తంగా రైతులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న నైరుతి రుతుప‌వ‌నాల రాక మ‌రింత ఆలస్యం కానుంది. జూన్ 4 లేదా 5వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ (IMD) అంచనా వేసింది. జూన్ 5-6 తేదీల తర్వాతే దేశంలో బలమైన రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంద‌ని పేర్కొంది.

D

National | Published On Jun 2, 2026, 10.23 am IST

IMD | జూన్ 5 త‌ర్వాతే బ‌ల‌మైన రుతుప‌వ‌నాలు : ఐఎండీ
Advertisement

IMD | దేశ‌వ్యాప్తంగా రైతులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న నైరుతి రుతుప‌వ‌నాల రాక మ‌రింత ఆలస్యం కానుంది. తొలుత మే 26 నాటికి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) కేరళ (Kerala)లోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (IMD) అంచ‌నా వేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత మే 28, జూన్ 1, జూన్ 3కి అంచ‌నా తేదీలు మారాయి. ఇప్పుడు మ‌రోసారి నైరుతి రాక ఆల‌స్యం కానుంద‌ని ఐఎండీ తెలిపింది.

జూన్ 4 లేదా 5వ తేదీన రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. జూన్ 5-6 తేదీల తర్వాతే దేశంలో బలమైన రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంద‌ని పేర్కొంది. దీని ప్రభావంతో కేరళలో రుతుపవనాల ఆరంభం కొంత బలహీనంగా ఉండొచ్చని.. ఆ తర్వాతే క్రమంగా వర్షాలు పుంజుకుంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

మ‌రోవైపు ఈ ఏడాది రుతుప‌వ‌నాల కాలంలో వ‌ర్ష‌పాతం సాధార‌ణం కంటే త‌క్కువ‌గానే న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కూ సాగే ఈ రుతుప‌వ‌నాల సీజ‌న్‌లో దేశ‌వ్యాప్తంగా దీర్ఘకాలిక సగటులో 90 శాతం వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. దీనికి ఎర్రర్ మార్జిన్ నాలుగు శాతంగా ఉండే అవ‌కాశం ఉంది. ఎల్‌నినో (El Nino) ప్రభావంతో ప‌లు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంద‌ని వెల్ల‌డించింది. జూన్​ నెలలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు (Heatwaves) నమోదవుతాయని ఐఎండీ తెలిపింది.

Also Read..

మేం పాల‌కులం కాదు.. మీ సేవ‌కులం : సీఎం రేవంత్ రెడ్డి

భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. కొన‌సాగుతున్న ఎఫ్ఐఐల అమ్మ‌కాలు..

పరేడ్​ గ్రౌండ్స్​లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు .. LIVE

Advertisement
Advertisement