త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కొన్ని పంట‌ల‌కే ప‌రిమితం కావొద్దు.. విభిన్న పంట‌లు వేయండి : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | కొన్ని పంట‌ల‌కే ప‌రిమితం కావొద్దు అని రాష్ట్ర రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రైతులు విభిన్న పంటల ఉత్పత్తితో తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా తెలంగాణ రైతులు కార్యసాధకులు కావాలంటే అప్పులేని పరిస్థితి ఉండాలి అని సీఎం అన్నారు.

S

Telangana | Published On Jun 2, 2026, 10.34 am IST

CM Revanth Reddy | కొన్ని పంట‌ల‌కే ప‌రిమితం కావొద్దు.. విభిన్న పంట‌లు వేయండి : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : కొన్ని పంట‌ల‌కే ప‌రిమితం కావొద్దు అని రాష్ట్ర రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రైతులు విభిన్న పంటల ఉత్పత్తితో తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా తెలంగాణ రైతులు కార్యసాధకులు కావాలంటే అప్పులేని పరిస్థితి ఉండాలి అని సీఎం అన్నారు. ప‌రేడ్ గ్రౌండ్‌లో నిర్వ‌హించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌ల్లో సీఎం పాల్గొని ప్ర‌సంగించారు.

రకరకాల అడ్డంకులు అధిగమిస్తూ 30 నెలల్లోనే ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాం. సాగు భూమి, వ్యవసాయం, రైతు ఈ మూడు తెలంగాణకు ఊపిరి. వ్యవసాయం - వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు - అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. రైతుల జీవితాల్లో మార్పు తేవాలన్న సంకల్పంతో “తెలంగాణ రైజింగ్ - 2047” విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితాలపై ఉండే అక్షరాలు కాదు అని సీఎం పేర్కొన్నారు.

రైతులను శ్రీమంతులుగా చేయాలన్న సంకల్ప పత్రం ఇది

ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి కొడంగల్ వరకు హరిత తెలంగాణను ఆవిష్కరించే ఆలోచన. ఈ లక్ష్య సాధనలో తెలంగాణలోని ప్రతి రైతు, రైతు కూలీలే సారథులు. దీని కోసం ఈ విజన్ డాక్యుమెంట్ లో “రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ” గా అభివర్ణించి, అభివృద్ధి చేసేందుకు రూపొందించిన పత్రం ఇది. అగ్రికల్చరల్ ఏకో సిస్టమ్ అభివృద్ధి చేసి, రైతులను శ్రీమంతులుగా చేయాలన్న సంకల్ప పత్రం ఇది. 2025-26 అంచనాల ప్రకారం మన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 236.87 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైంది. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంతో వరి, మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పశు సంపద, మత్స్య రంగాలు గణనీయమైన వృద్ధి సాధించాయ‌ని సీఎం తెలిపారు.

25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశాం..

అందుకే రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకే సారి రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశాం. రూ.20,616 కోట్లు రైతుల ఖాతాల్లో వేసి, దాదాపు 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తూనే, విద్యుత్తు పంప్ సెట్లకు సౌరశక్తితో నడిచే పంప్ సెట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. ఈ రెండున్నరేళ్లలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి రూ. 1 లక్షా 56 వేల 496 కోట్లు ఖర్చు చేశాం. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు రూ. 27 వేల 529 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో వేశాం. గత ఏడాది వానాకాలం రైతు భరోసా పెట్టుబడి సహాయ పథకం కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.8 వేల 744 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఈ ఏడాది ఇప్పటికే 5 వేల 700 కోట్ల రూపాయల రైతుభరోసా నిధులను నేరుగా రైతు ఖాతాలలో జమచేశాం. ఇది అన్నదాతల పట్ల మా చిత్తశుద్ధికి, వ్యవసాయం పట్ల మా ప్రాధాన్యతకు నిదర్శనమ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

ఎంత భారమైనా సరే, చివరి గింజ వరకు కొనుగోలు  

రైతులు దళారుల బారిన పడి మోసపోకూడదని, రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లిస్తుంది. ఎంత భారమైనా సరే, చివరి గింజ వరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. మేం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు రెండున్నరేళ్లలో ధాన్యం కొనుగోళ్లకు రూ. 82 వేల 840 కోట్లు ఖర్చు పెట్టినం. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రమంతా 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా చురుగ్గా ధాన్యం సేకరణ జరుగుతోంది. ఇప్పటివరకు 63.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. సుమారు రూ.11 వేల 903 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. దాదాపు 10 వేల మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోళ్లలో దేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీపడే పరిస్థితి లేదు. దేశంలో యాసంగి సీజన్‌లో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60 శాతం నమోదైందని చెప్పడానికి గర్విస్తున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న పంటల సాగు భారీగా పెరిగింది. ఈ యాసంగిలో సుమారు 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4 లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేసి తెలంగాణ రైతులు కొత్త చరిత్ర సృష్టించారు. మొక్కజొన్నల కొనుగోళ్లకు సుమారు 4 వేల 275 కోట్లు, జొన్న కొనుగోళ్లకు ఇప్పటి వరకు 1154 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించింది అని సీఎం తెలిపారు.

Advertisement
Advertisement