Ujjain Mosque Removal | ఉజ్జయినిలో ఘర్షణ.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు
Ujjain Mosque Removal | ఉజ్జయిని (Ujjain)లో ఘర్షణ వాతావరణం నెలకొంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా షాహి మసీద్ కూల్చివేత (Ujjain Mosque Removal) అంశం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, నిరసనకారుల (Protesters) మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్ (Tear Gas) ప్రయోగించారు. లాఠీఛార్జ్ (Lathi Charge) చేశారు.
Ujjain Mosque Removal | త్రినేత్ర న్యూస్ : మధ్యప్రదేశ్ ఉజ్జయిని (Ujjain)లో ఘర్షణ వాతావరణం నెలకొంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా షాహి మసీద్ కూల్చివేత (Ujjain Mosque Removal) అంశం ఉద్రిక్తతకు దారి తీసింది. మసీదు కూల్చివేయాలన్న అధికారుల నిర్ణయంపై స్థానికులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల (Protesters) మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులపైకి ఓ గుంపు రాళ్లు రువ్వింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్ (Tear Gas) ప్రయోగించారు. లాఠీఛార్జ్ (Lathi Charge) చేశారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కూడా రంగంలోకి దింపారు.
2028లో జరగనున్న సింహస్థ కుంభమేళా (Ujjain Simhastha) కోసం అధికారులు పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్డు విస్తరణ పనులను చేపట్టారు. ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఖజూర్ వాలీ మసీదు నుండి గణేష్ చౌక్ వరకు ఉన్న 730 మీటర్ల రోడ్డును 15 మీటర్ల మేర వెడల్పు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 272 కట్టడాలను పాక్షికంగా లేదా పూర్తిగా కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డు విస్తరణ మార్గంలో 1390 కాలం నాటి షాహి మసీదులోని కొంత భాగం తొలగించాల్సి వస్తోంది. అయితే, ఇది 600 ఏళ్ల చరిత్ర గల వక్ఫ్ ఆస్తి అని స్థానికులు చెబుతున్నారు. దీంతో మసీదు కూల్చివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తొలగింపు చర్యలను అడ్డుకునేందుకు వేలాది మంది నిరసనకారులు ఆదివారం రాత్రి నుంచే మసీదు వద్దకు చేరుకున్నారు. వారు రాత్రంతా అక్కడే ఉన్నారు. ఇవాళ ఉదయం కూల్చివేత కోసం జేసీబీలతో వెళ్లిన అధికారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
#WATCH | Madhya Pradesh: Police use tear gas shells to control a crowd in Ujjain as stone pelting occurred when a large group of people clashed with them at the spot where a portion of Shahi Masjid is planned to be demolished for a road-widening project. Rapid Action Force (RAF)… pic.twitter.com/zRLlSzgXoj
— ANI (@ANI) September 28, 2026
#WATCH | Madhya Pradesh: A large group of people clashes with Police in Ujjain at the spot where a portion of Shahi Masjid is planned to be demolished for a road-widening project. A heavy police force remains deployed in the area. pic.twitter.com/jeq03Wcd5s
— ANI (@ANI) September 28, 2026
Also Read..
గృహోపకరణాల ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన షేర్ల ధరలు..
భారీగా పెరిగిన బాలాపూర్ గణేశుడి హుండీ ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే?
ఒక్క రోజులోనే రూ.25వేలకు పైగా తగ్గిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు నిపుణుల అలర్ట్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Blue Star | గృహోపకరణాల ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన షేర్ల ధరలు..
- ●Balapur Ganesh | భారీగా పెరిగిన బాలాపూర్ గణేశుడి హుండీ ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే?
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.25వేలకు పైగా తగ్గిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు నిపుణుల అలర్ట్..
- ●PB Fintech | పాలసీ బజార్ షేర్లకు ఊరట.. 4 శాతం జంప్.. కొనాలా.. వేచి చూడాలా..?
- ●Additional Collector | కంటైనర్ను ఢీకొట్టిన కారు.. కొత్తగూడెం అదనపు కలెక్టర్కు తప్పిన ప్రమాదం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు బ్లాక్ మండే.. భారీగా అమ్మకాలు..

Blue Star | గృహోపకరణాల ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన షేర్ల ధరలు..

Balapur Ganesh | భారీగా పెరిగిన బాలాపూర్ గణేశుడి హుండీ ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే?

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.25వేలకు పైగా తగ్గిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు నిపుణుల అలర్ట్..

PB Fintech | పాలసీ బజార్ షేర్లకు ఊరట.. 4 శాతం జంప్.. కొనాలా.. వేచి చూడాలా..?






