త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | కునో, ఉజ్జయినిలో సఫారీల ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court | దేశంలో సఫారీ పర్యాటకాన్ని మరింత విస్తరించేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రతిపాదనలపై సుప్రీంకోర్టు కీలక ముందడుగు వేసింది. కునోలో చీతా సఫారీ, ఉజ్జయినిలో జూ-కమ్‌-సఫారీ ఏర్పాటుపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) అభిప్రాయం కోరింది. ఈ మేరకు కేంద్రం, సెంట్రల్‌ జూ అథారిటీకి నోటీసులు జారీ చేసింది.

P

National | Published On Nov 24, 2026, 8.10 pm IST

Supreme Court | కునో, ఉజ్జయినిలో సఫారీల ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Advertisement

Supreme Court | దేశంలో సఫారీ పర్యాటకాన్ని మరింత విస్తరించేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రతిపాదనలపై సుప్రీంకోర్టు కీలక ముందడుగు వేసింది. కునోలో చీతా సఫారీ, ఉజ్జయినిలో జూ-కమ్‌-సఫారీ ఏర్పాటుపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) అభిప్రాయం కోరింది. ఈ మేరకు కేంద్రం, సెంట్రల్‌ జూ అథారిటీకి నోటీసులు జారీ చేసింది. డిసెంబర్‌ 3కు తదుపరి విచారణ వాయిదా వేసింది. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లా కునోలో 181 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో చీతా సఫారీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో 124 హెక్టార్ల అటవీ భూమి, 56 హెక్టార్లకు పైగా రెవెన్యూ భూమి ఉంది. గాయపడిన చీతాలకు చికిత్స, అనాథ పిల్లల సంరక్షణ, పరిశోధనలు, పర్యాటక అభివృద్ధి ఈ ప్రాజెక్టు లక్ష్యాలు.

200 హెక్టార్లలో ఉజ్జయిని సఫారీ..

ఉజ్జయినిలోని నౌలఖి అటవీ ప్రాంతంలో 200 హెక్టార్లలో జూ, సఫారీ నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వన్యప్రాణుల సంరక్షణతోపాటు పర్యాటకాన్ని ప్రోత్సహించడం దీని ఉద్దేశం. పౌరాణిక అంశాలతో వన్యప్రాణుల ప్రదర్శనలు, వివరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సెంట్రల్‌ జూ అథారిటీ తుది అనుమతి ఇంకా లభించలేదు. అటవీ ప్రాంతాల్లో జూ, సఫారీ ఏర్పాట్లకు సుప్రీంకోర్టు గతంలో అనుమతి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. గత జూలైలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కుక్రైల్‌ అటవీ ప్రాంతంలో దేశంలోనే తొలి నైట్‌ సఫారీకి సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

Advertisement
Advertisement