త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | వాళ్లంతా యువ విద్యార్థులు.. ఢిల్లీ పోలీసుల‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటూ దాఖ‌లైన‌ పిటిష‌న్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

Supreme Court | సీజేపీ నిర‌స‌న‌ల వేళ నిరసనకారులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ పోలీసులకు ( Delhi Police) పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది. నిరసనల్లో పాల్గొన్నది యువ విద్యార్థులని (young students), వారి భవిష్యత్తును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.

D

National | Published On Oct 9, 2026, 2.25 pm IST

Supreme Court | వాళ్లంతా యువ విద్యార్థులు.. ఢిల్లీ పోలీసుల‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటూ దాఖ‌లైన‌ పిటిష‌న్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : నిరసనకారులను ఎదుర్కొనేందుకు ఢిల్లీ పోలీసులకు ( Delhi Police) పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది. నిర‌స‌న‌ల్లో పాల్గొన్న‌ది యువ విద్యార్థుల‌ని (young students).. ఇలాంటి అంశాలను పరిశీలించేటప్పుడు యువత భవిష్యత్తును, వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంద‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం పేర్కొంది.

ఈ పిటిష‌న్‌ను సీజేఐ జస్టిస్ (CJI) సూర్యకాంత్ (CJI Surya Kant) నేతృత్వంలోని ధ‌ర్మాసనం విచారించింది. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. "ఇక్కడ మన ముందున్న నిరసనకారులు, ఆందోళ‌న‌కారులు చాలా మంది యువ విద్యార్థులు. వారి తల్లిదండ్రుల గురించి మనం ఆలోచించాలి. వారికి మంచి భ‌విష్య‌త్తు ఉంది. వారు కోర్టు విచారణలు వంటివాటిలో చిక్కుకుపోకూడదు" అని సీజేఐ ధ‌ర్మాస‌నం పేర్కొంది. అయితే, నిరసనకారులకు రక్షణ కల్పిస్తూ గతంలో తాము ఇచ్చిన రక్షణ ఉత్తర్వులు కేవలం విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి, కఠినమైన నేరస్తులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి ఈ మిన‌హాయింపులు వ‌ర్తించ‌వ‌ని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు పిటిష‌న్‌ను కొట్టివేసింది.

Also Read..

నా దేశానికి ఏమవుతోంది..? ఢిల్లీ ష‌ట్‌డౌన్‌పై సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసిన సీనియ‌ర్ న్యాయ‌వాదులు

సీజేపీ నిర‌స‌న‌ల‌తో ఢిల్లీలో హై అల‌ర్ట్‌.. రైళ్లు ర‌ద్దు, మెట్రో స్టేష‌న్లు మూసివేత‌..!

95 ల‌క్ష‌ల ఓట్లు తొల‌గించార‌నే వార్త అవాస్త‌వం

Advertisement
Advertisement