త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.25వేల‌కు పైగా త‌గ్గిన పసిడి ధ‌ర‌.. పెట్టుబ‌డిదారుల‌కు నిపుణుల అల‌ర్ట్‌..

Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య తీవ్ర‌మ‌వుతున్న యుద్ధం, పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌లు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల దేశీయ‌, అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు సోమ‌వారం భారీ న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. అయితే ఇదే స‌మ‌యంలో అమెరికా బాండ్ ఈల్డ్స్ కూడా పెరుగుతుండ‌డంతో బంగారం ధ‌ర‌ల‌పై నేరుగా ప్ర‌భావం ప‌డుతోంది.

S

Business | Published On Sep 28, 2026, 11.08 am IST

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.25వేల‌కు పైగా త‌గ్గిన పసిడి ధ‌ర‌.. పెట్టుబ‌డిదారుల‌కు నిపుణుల అల‌ర్ట్‌..
Advertisement

Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య తీవ్ర‌మ‌వుతున్న యుద్ధం, పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌లు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల దేశీయ‌, అంత‌ర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు సోమ‌వారం భారీ న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి. అయితే ఇదే స‌మ‌యంలో అమెరికా బాండ్ ఈల్డ్స్ కూడా పెరుగుతుండ‌డంతో బంగారం ధ‌ర‌ల‌పై నేరుగా ప్ర‌భావం ప‌డుతోంది. పెట్టుబ‌డిదారులు డాల‌ర్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. దీంతో ప‌సిడి ధ‌ర‌లు త‌గ్గుతున్నాయి. సోమ‌వారం అంత‌ర్జాతీయ మార్కెట్‌ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర 2.27 శాతం మేర భారీగా ప‌త‌న‌మై 4,187 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 4.20 శాతం త‌గ్గి 61 డాలర్ల‌కు వచ్చింది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 2,898 పాయింట్లు త‌గ్గి 1,47,900కు చేర‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 7వేల పాయింట్ల‌కు పైగా త‌గ్గి 2,27,561కు చేరింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గాయి. బంగారం ధ‌ర ఒక్క రోజులోనే సుమారుగా రూ.25వేల‌కు పైగా తగ్గింది.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.15,017 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,20,136 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,50,170 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.15,01,700 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.25,100 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,765 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,10,120గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,37,650 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,76,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.23,000 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,263 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.90,104గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,12,630 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,26,300గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.18,800 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,40,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు త‌గ్గింది. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,45,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,450 గా ఉంది.

Advertisement
Advertisement