త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balapur Ganesh | భారీగా పెరిగిన‌ బాలాపూర్ గ‌ణేశుడి హుండీ ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే?

Balapur Ganesh | వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల్లో ల‌డ్డూ వేలం అన‌గానే ట‌క్కున గుర్తొచ్చేది బాలాపూర్ గ‌ణేశుడు (Balapur Ganesh). ఈసారి రికార్డు స్థాయిలో రూ.39 ల‌క్షలు ప‌లికింది. తాజాగా హుండీ ఆదాయం కూడా (Hundi Collection ) గ‌ణ‌నీయంగా పెరిగ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

G

Hyderabad | Published On Sep 28, 2026, 11.46 am IST

Balapur Ganesh | భారీగా పెరిగిన‌ బాలాపూర్ గ‌ణేశుడి హుండీ ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే?
Advertisement

Balapur Ganesh | త్రినేత్ర న్యూస్‌: వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల్లో ల‌డ్డూ వేలం అన‌గానే ట‌క్కున గుర్తొచ్చేది బాలాపూర్ గ‌ణేశుడు (Balapur Ganesh). ఈసారి రికార్డు స్థాయిలో రూ.39 ల‌క్షలు ప‌లికింది. తాజాగా హుండీ ఆదాయం కూడా (Hundi Collection ) గ‌ణ‌నీయంగా పెరిగ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 11 రోజుల పాటు పూజలందుకున్న లంబోద‌రుడికి ఏకంగా రూ.28 లక్షలకు పైగా హుండీ ఆదాయం సమకూరింది.

నిమ‌జ్జ‌నోత్స‌వం ముగియ‌డంతో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను ఆదివారం లెక్కించారు. ఈ సంద‌ర్భంగా రూ.28,11,999 ఆదాయం సమకూరినట్టు బాలాపూర్‌ ఉత్సవ సమితి వెల్ల‌డించింది. దీంతో గ‌ణ‌నాధుడికి కానుకలు సమర్పించిన భక్తులకు ధన్యవాదాలు తెలిపింది.

కాగా, బాలాపూర్ గ‌ణేశుడి హుండీ ఆదాయం ప్ర‌తీ ఏటా పెరుగుతూ వ‌స్తున్న‌ది. గడిచిన మూడేండ్లుగా ఏడాదికి సుమారుగా రూ.5 లక్షలు అధిక‌మ‌వుతున్న‌ది. 2024లో రూ.18 లక్షలు, 2025లో రూ.23,13,760 స‌మ‌కూరింది. ఈ ఏడాది ఆ మొత్తం రూ.28 ల‌క్ష‌లు దాటింది. లడ్డూ ఆదాయం (Balapur Laddu) కూడా ప్రతి సంవత్సరం దాదాపుగా రూ.4నుంచి రూ.5 లక్షలు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. 1994లో రూ.450తో ప్రారంభ‌మైన ల‌డ్డూ వేలం ఈ ఏడాది రూ.39 ల‌క్ష‌ల‌కు చేరింది. వ‌న‌స్థ‌లిపురం సాహెబ్‌న‌గ‌ర్‌కు చెందిన సామ ప్ర‌ణీత్ రెడ్డి వేలంగా ల‌డ్డూను ద‌క్కించుకున్నారు. గ‌తేడాది లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలకు గ‌ణేశుడి ల‌డ్డూను సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement