త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Neha Bora | మ‌హిళ‌ల‌ను రాత్రిపూట నిర్బంధించ‌డ‌మేంటి..? ఇది ఏ చ‌ట్ట‌ప్ర‌కారం స‌మ‌ర్థ‌నీయం : నేహా బోరా

Neha Bora | నిరసనకారులను పోలీసులు రాత్రిపూట నిర్బంధించడాన్ని ఏఐఎస్ఎఫ్ అధ్య‌క్షురాలు (AISA National President) నేహా బోరా (Neha Bora) తీవ్రంగా ఖండించారు. చట్టప్ర‌కారం సూర్యాస్తమయం తర్వాత సాధారణంగా మహిళలను పోలీస్ స్టేషన్లలో ఉంచకూడదన్నారు. ఏ చ‌ట్ట ప్ర‌కారం ఇది స‌రైన‌దో ఢిల్లీ పోలీసులు స‌మాధానం చెప్పాల‌న్నారు. అంతేకాదు, ప్ర‌జ‌లు ప్ర‌శాంతంగా జీవించాలంటే చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar)ను అభిశంసించాలని డిమాండ్ చేశారు.

D

National | Published On Oct 17, 2026, 11.25 am IST

Neha Bora | మ‌హిళ‌ల‌ను రాత్రిపూట నిర్బంధించ‌డ‌మేంటి..? ఇది ఏ చ‌ట్ట‌ప్ర‌కారం స‌మ‌ర్థ‌నీయం : నేహా బోరా
Advertisement

Neha Bora | త్రినేత్ర న్యూస్ : ఢిల్లీ పోలీసుల తీరుపై ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స‌ర్ వ్య‌తిరేక ఆందోళనల నేపథ్యంలో నిరసనకారులను రాత్రిపూట నిర్బంధించడాన్ని ఆమె ఖండించారు. అంతేకాకుండా త‌న‌ని రాత్రంతా స్టేష‌న్‌లో పెట్టి లాయ‌ర్‌ని కూడా క‌ల‌వ‌కుండా అడ్డుకున్నార‌ని ఆరోపించారు.

సీజేపీ లహ్రా దో తిరంగా (lehra do tiranga) నిర‌స‌న కార్య‌క్ర‌మం నేప‌థ్యంలో శుక్ర‌వారం సాయంత్రం సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే స‌హా నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్బంధించిన విష‌యం తెలిసిందే. ఇవాళ ఉద‌యం నేహాను విడుద‌ల చేశారు. అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలీసుల చ‌ర్య‌ల‌పై తీవ్రంగా మండిప‌డ్డారు. సూర్యాస్తమయం తర్వాత మహిళలను పోలీసు స్టేషన్‌లో ఉంచకూడదని, వారిని వెంటనే విడుదల చేయాలని అన్నారు.

"ఇది ఏ అధికారం కింద సమర్థనీయం..? నిర్బంధంలో ఉన్నవారిని రాత్రి అంతా అదుపులో ఉంచడానికి ఏ చట్టం అనుమ‌తిస్తుంది. చట్టబద్ధత, శాంతిభద్రతలు ఇలా ప్ర‌తీ విషయంలోనూ ఉల్లంఘనలు జ‌రుగుతున్నాయి. సాధారణ పౌరులను కరుడుగట్టిన నేరస్థుల్లా చూస్తున్నారు. చాలా కాలంగా మ‌న దేశంలో ఇదే ధోర‌ణి కొన‌సాగుతోంది. ప‌గ‌టిపూట అయినా, సాయంత్రం అయినా ప్ర‌జ‌ల‌ను ఎలా నిర్బంధిస్తున్నారు. చట్టప్ర‌కారం సూర్యాస్తమయం తర్వాత సాధారణంగా మహిళలను పోలీస్ స్టేషన్లలో ఉంచకూడదు. కానీ న‌న్ను రాత్రంతా నిర్బంధంలోనే ఉంచారు. ఏ చ‌ట్ట ప్ర‌కారం ఇది స‌రైన‌దో ఢిల్లీ పోలీసులు స‌మాధానం చెప్పాలి. న‌న్ను నిర్బంధించిన త‌ర్వాత గంట‌ల త‌ర‌బ‌డి లాయ‌ర్ల‌ను కూడా క‌ల‌నివ్వ‌లేదు. వారు న‌న్ను సంప్ర‌దించ‌డానికి దాదాపు 5 గంట‌లు వెయిట్ చేశారు. రాత్రంతా పోలీసులు తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేశారు. ఇది ఏ అధికారం కింద సమర్థనీయం..? రాత్రి అంతా నిర్బంధంలో ఉంచడానికి ఏ చట్టం అనుమతిస్తుంది..?" అంటూ నేహా బోరా తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

అరాచ‌కం మీరు సృష్టిస్తున్నారు..

అదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై నేహా బోరా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. నిర‌స‌నల‌ పేరుతో అరాచ‌కం, గంద‌ర‌గోళం సృష్టిస్తున్నారంటూ అధికారులు చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆమె తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. "ఎలాంటి అరాచకం..? మధ్య ఢిల్లీలో మీరు సృష్టించిన అరాచకమా..? రోడ్లను బ్లాక్ చేసి.. సాధారణ పౌరులు తమ ఉద్యోగాలకు కూడా వెళ్లకుండా ఇబ్బందులకు గురిచేస్తూ అసలైన అరాచకాన్ని అధికారులే వ్యాప్తి చేస్తున్నారు. ఢిల్లీ ప్రజలు కనీసం ప్రశాంతంగా ఊపిరి కూడా పీల్చుకోలేక‌పోతున్నారు. దేశవ్యాప్తంగా మీరే గందరగోళాన్ని, అరాచకాన్ని వ్యాప్తి చేస్తున్నారు" అంటూ మండిప‌డ్డారు.

సీఈసీని అభిశంసించండి

దేశ పౌరులు త‌మ‌ ఓటు హ‌క్కును కాపాడుకోవ‌డానికి, ప్ర‌శాంతంగా జీవించ‌డానికి వీలుగా చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar)ను అభిశంసించాలని (Impeach) నేహా బోరా డిమాండ్ చేశారు. అంతేకాకుండా వివాదాస్ప‌దంగా మారిన ఓటర్ల జాబితా ప్రత్యేక స‌మ‌గ్ర‌ సవరణ ప్రక్రియ స‌ర్‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని కోరారు.

Also Read..

ముంబైలో సీజేపీ నిర‌స‌న‌ అట్ట‌ర్ ఫ్లాప్ల‌ 

వాహ‌నాల‌కు బీఎస్‌-7 నిబంధ‌న‌లు.. కీల‌క మార్పుల‌కు కేంద్రం క‌స‌ర‌త్తు..

న్యూజిలాండ్‌లో వింత టూరిస్ట్ స్పాట్: 40 మీటర్ల కంచె నిండా వందలాది బ్రాలు.. అసలు కథేంటంటే!

Advertisement
Advertisement