Blue Star | గృహోపకరణాల ధరలకు రెక్కలు.. భారీగా పెరిగిన షేర్ల ధరలు..
Blue Star | ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థలైన బ్లూ స్టార్, వోల్టాస్, బాష్ హోమ్ కంఫర్ట్ ఇండియా షేర్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. పండుగల సీజన్ ప్రారంభానికి ముందు ఉత్పత్తుల ధరలను 5 నుంచి 8 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీలు ప్రకటించడంతో ఆయా షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది. ఈ ధరల పెంపు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
Blue Star | ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థలైన బ్లూ స్టార్, వోల్టాస్, బాష్ హోమ్ కంఫర్ట్ ఇండియా షేర్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. పండుగల సీజన్ ప్రారంభానికి ముందు ఉత్పత్తుల ధరలను 5 నుంచి 8 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీలు ప్రకటించడంతో ఆయా షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది. ఈ ధరల పెంపు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. బ్లూ స్టార్ సంస్థ ఎయిర్ కండిషనర్ల ధరలను 8 శాతం పెంచనున్నట్లు ఇప్పటికే ధ్రువీకరించింది. ఎయిర్ కండిషనర్లు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఇతర గృహోపకరణాల ధరలను పెంచేందుకు తయారీదారులు నిర్ణయించారు. పెరుగుతున్న ఇన్‌పుట్ వ్యయాలను వినియోగదారులకు బదిలీ చేయడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణంగా ఉంది. ముఖ్యంగా రాగి, ఉక్కు, ముడిచమురు ఆధారిత ఉత్పత్తుల ధరల పెరుగుదలతో పాటు, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడుతున్న కరెన్సీ మారకపు విలువల్లో అస్థిరత కంపెనీల వ్యయాలపై ప్రభావం చూపుతోంది.
ధరల పెంపు మూడోసారి..
ప్రస్తుత సంవత్సరంలో గృహోపకరణాల పరిశ్రమలో ఇది మూడో విడత ధరల పెంపుగా నిలవనుంది. రాగి, అల్యూమినియం, ఉక్కు, ముడిచమురు ఆధారిత ఉత్పత్తుల ధరలు నిరంతరం పెరుగుతుండడంతోపాటు రవాణా వ్యయాలు కూడా అధికమయ్యాయి. దీంతో తయారీదారులు మరోసారి ఉత్పత్తుల ధరలను సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారీగా పెరిగిన షేర్ల ధరలు..
షేర్ల విషయానికి వస్తే బాష్ హోమ్ కంఫర్ట్ ఇండియా షేరు 3 శాతం వరకు పెరిగి రూ.1,815.30 గరిష్ఠాన్ని తాకింది. వోల్టాస్ షేరు 1.56 శాతం లాభపడి రూ.1,135.60 వద్ద గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఐఎఫ్‌బీ షేరు 2 శాతం పెరిగి రూ.1,249.70 ఇంట్రాడే గరిష్ఠానికి చేరుకుంది. బ్లూ స్టార్ షేరు 1.82 శాతం లాభంతో రూ.1,568.70 వద్దకు చేరింది. అనంతరం ఈ షేర్లు కొంతమేర లాభాలను కోల్పోయినా, 0.15 శాతం నుంచి 2 శాతం మధ్య లాభాలతో ట్రేడయ్యాయి.
తాజావార్తలు
- ●Road Accident | నస్పూర్లో లారీ, ఆటో ఢీ.. ముగ్గురు మహిళలు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం!
- ●IPO | ఐపీఓల జాతర.. ఈ వారం 20 కొత్త ఇష్యూలు..
- ●Ponnam Prabhakar | మహిళల ఆర్థిక సాధికారతే.. సమాజ అభివృద్ధికి పునాది: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Ujjain Mosque Removal | ఉజ్జయినిలో ఘర్షణ.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు
- ●Balapur Ganesh | భారీగా పెరిగిన బాలాపూర్ గణేశుడి హుండీ ఆదాయం.. ఈ ఏడాది ఎంతంటే?
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.25వేలకు పైగా తగ్గిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు నిపుణుల అలర్ట్..

Road Accident | నస్పూర్లో లారీ, ఆటో ఢీ.. ముగ్గురు మహిళలు మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం!

IPO | ఐపీఓల జాతర.. ఈ వారం 20 కొత్త ఇష్యూలు..

Ponnam Prabhakar | మహిళల ఆర్థిక సాధికారతే.. సమాజ అభివృద్ధికి పునాది: మంత్రి పొన్నం ప్రభాకర్

Ujjain Mosque Removal | ఉజ్జయినిలో ఘర్షణ.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు





