VS Babu | విజయ్ పార్టీలో తీవ్ర విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే మృతి
VS Babu | తమిళనాడులోని టీవీకే ప్రభుత్వంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన టీవీకే నేత, ఎమ్మెల్యే వీఎస్ బాబు (VS Babu) మరణించారు.
VS Babu | త్రినేత్ర న్యూస్ : తమిళనాడులోని టీవీకే ప్రభుత్వంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin)ను ఓడించి సంచలనం సృష్టించిన టీవీకే నేత, ఎమ్మెల్యే వీఎస్ బాబు మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 75 ఏళ్లు. తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న వీఎస్ బాబు.. సెప్టెంబర్ 9న చెన్నైలోని MGM హెల్త్‌కేర్ (MGM Healthcare) ఆసుపత్రిలో చేరారు. దాదాపు 70 రోజులకు పైగా ఐసీయూలో చికిత్స పొందిన ఆయన.. ఇవాళ మధ్యాహ్నం 2:24 గంటల సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు.
2026 ఏప్రిల్ 23న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు (Kolathur) నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా పోటీ చేసిన వీఎస్ బాబు.. అప్పటి ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను ఓడించారు. ఎన్నికల్లో బాబుకు 88,180 ఓట్లు రాగా.. స్టాలిన్‌కు 72,988 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంపై డీఎంకేకి మంచి పట్టుంది. 2011 నుంచి ఎంకే స్టాలిన్ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందుతున్నారు. వరుసగా మూడుసార్లు గెలిచిన ఆయన.. తన పట్టును నిలుపుకున్నారు. 2016లో 51.4 శాతం ఓట్లతో సులభంగా గెలిచిన స్టాలిన్.. 2021లో 1,05,522 ఓట్లు సాధించి ఏఐఏడీఎంకే అభ్యర్థి ఆది రాజారాంపై 70,384 ఓట్ల మెజారిటీతో (61.4 శాతం ఓట్లతో) విజయం సాధించారు. కానీ అనూహ్యంగా ఈ ఏడాది ఎన్నికల్లో వీఎస్ బాబు చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. గతంలో డీఎంకేలో ఉన్న వీఎస్ బాబు.. 2006–2011 మధ్య పురసవాక్కం నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. అనంతరం అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ పార్టీని వీడి టీవీకేలో చేరారు. టీవీకే టికెట్‌పై ఏకంగా ఎంకే స్టాలిన్‌పైనే పోటీకి నిలబడ్డారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎవరూ ఊహించని రీతిలో ఘన విజయం సాధించి సంచలనం సృష్టించారు. అప్పట్లో వీఎస్ బాబు పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే హఠాన్మరణంతో టీవీకేలో విషాదం చోటు చేసుకుంది. పలువురు నేతలు ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
ఓటమిని స్టాలిన్ మద్రాసు హైకోర్టులో సవాల్ చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్ (VVPAT) స్లిప్పులను 100 శాతం తిరిగి లెక్కించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు, వీఎస్ బాబు విజయాన్ని రద్దు చేసి తనను విజేతగా ప్రకటించాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే, అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తప్పలేదు. స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని స్పష్టం చేస్తూ సెప్టెంబర్ 3న న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వీఎస్ బాబు ఎన్నిక విజయం యథాతథంగా నిలిచింది. స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే హఠాన్మరణంతో టీవీకేలో విషాదం చోటు చేసుకుంది. పలువురు నేతలు ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Also Read..
దలాల్ స్ట్రీట్‌లో భారీ జోష్.. 990 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
సంబంధిత వార్తలు

Mekedatu Dam | సీఎం డీకే Vs మాణికం ఠాగూర్.. కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన మేకెదాటు
నవంబర్ 14, 2026

Security Lapse | సీఎం విజయ్ భద్రతలో భారీ లోపం.. కాన్వాయ్ దాటి దూసుకొచ్చిన వ్యక్తి..!
నవంబర్ 13, 2026

Special Parliament Session | త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు : ప్రభుత్వ వర్గాలు
నవంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ
- ●BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం
- ●Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే
- ●Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..
- ●Supreme Court | ఆ విషయం తేల్చకుండా.. ఇళ్ల కొనుగోలుదారులపై బలవంతపు రికవరీలు వద్దు
- ●HMWSSB | హైదరాబాద్ నీటి కష్టాలకు చెక్!

Krithi Shetty | కీర్తి సురేష్, కృతిశెట్టి మాస్ స్టెప్పులు - హీరోయిన్ల పాటతో ప్రమోషన్స్ షురూ

BMS | రవాణా కార్మికుల సమస్యలపై కేంద్రం సానుకూలం

Rajagopal Reddy | ఇకనైనా అహంకారాన్ని వీడు.. నీలో ఎంతో మార్పు వచ్చేదుండే

Anthropic Shares | నిరాశపరిచిన ఆంథ్రోపిక్.. లిస్టింగ్ రెండో రోజే భారీ పతనం..



